మద్దూరు ( ధూళిమిట్ట): రేబర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం బలోపేతానికి కృషి చేస్తున్నట్లు చైర్మన్ నాగిళ్ల తిరుపతిరెడ్డి అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలోని సొసైటీ క్యాష్ కౌంటర్ కార్యాలయంలో మహాజన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఆరేండ్ల వ్యవధిలో సుమారు పది లక్షల డిపాజిట్లను సేకరించినట్లు తెలిపారు. గతంలో ఎనిమిది ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండగా ప్రస్తుతం 14 కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి ధాన్యాన్ని సేకరిస్తున్నట్లు తెలిపారు. రూ.2.44 కోట్ల గోల్డ్ లోన్లను అందించినట్లు తెలిపారు.
13 పర్యాయాలు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో 17 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు తెలిపారు. రైతులకు నాలుగు కోట్ల పంట రుణాలను అందించినట్లు తెలిపారు. ప్రస్తుతం సొసైటీ మూడు కోట్ల 45 లక్షల టర్నవర్ తో కొనసాగుతున్నట్లు తెలిపారు. సొసైటీ పరిధిలో సుమారు 15 లక్షల పంట రుణాల బకాయిలు పేరుకపోయినట్లు తెలిపారు. ఈ రుణాలను వెంటనే వసూలు చేసుకునేందుకు సభ ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్టు తెలిపారు.
అక్టోబర్ 1 నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో పిఎసిఎస్ వైస్ చైర్మన్ ఇర్రి రాజిరెడ్డి, సీఈవో బోయని శ్రీధర్, సొసైటీ డైరెక్టర్లు కర్రెడ్ల శ్రీధర్ రెడ్డి, కొండ అంజయ్య, భూక్య జగన్, మేక మల్లేశం, దేవనూరు దేవదాస్, ఉత్కం మల్లేశం, స్టాప్ అసిస్టెంట్ వజ్జల్ల ఉపేందర్, సిబ్బంది ఎర్ర బచ్చల విజయ్ తదితరులు పాల్గొన్నారు.