మాట తప్పిన కాంగ్రెస్‌ను బొందపెట్టాలి
కేంద్రం తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిందని చెప్పే రేవంత్‌రెడ్డి ఈ నాలుగు నెలల్లో నువ్వుచ్చింది కూడా గాడిద గుడ్డేనని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. ఈ ఎన్నికలు అధికారం కోసం, పదవుల కోసం కాదని, తెలంగాణ భవిష్యత్ కోసమే అన్నారు.
- మంచి వ్యక్తి వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు
- నంగునూరు మండలకేంద్రంలో భారీ రోడ్‌షో
నంగునూరు, మే 1: కేంద్రం తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిందని చెప్పే రేవంత్‌రెడ్డి ఈ నాలుగు నెలల్లో నువ్వుచ్చింది కూడా గాడిద గుడ్డేనని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. ఈ ఎన్నికలు అధికారం కోసం, పదవుల కోసం కాదని, తెలంగాణ భవిష్యత్ కోసమే అన్నారు. బుధవారం నంగునూరు మండలకేంద్రంలో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా హరీశ్‌రావు రోడ్‌షో నిర్వహించారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ కేంద్రం పదేండ్లలో మొండిచేయి చూపితే, వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తానని రేవంత్‌రెడ్డి మాట తప్పారన్నారు. రూ.2 లక్షలు రుణమాఫీ, రూ.4 వేల పింఛన్, రైతుబంధు, మహిళలకు రూ.2500, పంట బోనస్ రూ.500 ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారన్నారు. కేసీఆర్ వల్లే మన కాలువల్లోకి నీళ్లు వచ్చి రెండు పంటలు పండాయన్నారు.
రంగనాయకసాగర్ రిజర్వాయర్‌తో చెరువులు నింపి బంగారం లాంటి పంటలు పండించామన్నారు. ఈ ఎన్నికలు సిద్దిపేట ఆత్మగౌరవ ప్రతీక అని, సిద్దిపేట పరువు తీసే ప్రయత్నం చేస్తున్న రేవంత్‌రెడ్డికి తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మంచి వ్యక్తి అయిన వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ కలెక్టర్‌గా నాడు సేవలు అందించానని, నేడు ఎంపీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చానన్నారు.
కేసీఆర్ ఆశీస్సులు, హరీశ్‌రావు సూచనతో గెలుస్తాననే నమ్మకం ఏర్పడిందని ధీమా వ్యక్తం చేశారు. రూ.వంద కోట్లతో ట్రస్ట్ ఏర్పాటు చేసి పేద పిల్లల విద్య కోసం, పోటీ పరీక్షలు ప్రిపేరయ్యే వారికి ఉచిత శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తానన్నారు. రూ.పది లక్షల ప్రమాద బీమా అందరికీ చేస్తానని ప్రజలకు హామీనిచ్చారు. కార్యక్రమంలో నాయకులు జాప శ్రీకాంత్‌రెడ్డి, ఎడ్ల సోమిరెడ్డి, లింగంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

