సిద్దిపేట అర్బన్, ఏప్రిల్ 24 : సిద్దిపేట జిల్లావ్యాప్తంగా ఆదివారం జరిగిన మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం ఆరో తరగతి ప్రవేశాల కోసం 17 కేంద్రాల్లో జరిగిన పరీక్షకు 2,382 మంది విద్యార్థులకు 2201 మంది హాజరు కాగా, 181 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల కోసం 15 కేంద్రాల్లో జరిగిన ప్రవేశ పరీక్షకు 1386 మంది విద్యార్థులకు 172 మంది హాజరు కాగా, 172 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఇందులో ఏడో తరగతి కోసం 626 మంది విద్యార్థులకు 561 మంది హాజరై కాగా, 65 మంది గైర్హాజరయ్యారు. ఎనిమిదో తరగతి కోసం 464 మంది విద్యార్థులకు 409 మంది విద్యార్థులు హాజరై 55 మంది గైర్హాజరయ్యారు. తొమ్మిదో తరగతి కోసం 220 మందికి 189 మంది హాజరై 31 మంది గైర్హాజరయ్యారు. పదో తరగతి కోసం 76 మందికి 55 మంది హాజరై 21 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఉదయం, మధ్యాహ్నం రెండు పరీక్షలకు సంబంధించి మొత్తం 3,768 మంది విద్యార్థులకు 3,415 మంది హాజరుకావడంతో 90.63 హాజరు శాతం నమోదైనట్లు జిల్లా విద్యాధికారి రవికాంతారావు తెలిపారు.
మద్దూరులో..
మద్దూరు(ధూళిమిట్ట), ఏప్రిల్ 24 : మద్దూరు మండల కేంద్రంలో మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు 6వ తరగతి ప్రవేశ పరీక్ష, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు 7 నుంచి 10వ తరగతి ప్రవేశాల కోసం పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ వై.శ్రీహరి మాట్లాడుతూ 6వ తరగతి ప్రవేశ పరీక్ష కోసం 151 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకోగా, 139 మంది పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. 7వ తరగతి ప్రవేశ పరీక్ష కోసం 24 మంది దరఖాస్తు చేసుకోగా, 22 మంది పరీక్షకు హాజరయ్యారని, 8వ తరగతి ప్రవేశ పరీక్ష కోసం 17 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 15 మంది పరీక్షకు హాజరయ్యారన్నారు. 9వ తరగతి కోసం 8 మంది దరఖాస్తు చేసుకోగా ఏడుగుగురు, 10వ తరగతి పరీక్ష కోసం నలుగురు దరఖా స్తు చేసుకోగా ఒక్కరు మాత్రమే హాజరయ్యారని తెలిపారు.
దుబ్బాక టౌన్లో..
దుబ్బాక టౌన్, ఏప్రిల్ 24 : దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేట మోడల్ స్కూల్లో జరిగిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా నిర్వహించినట్లు నిర్వాహకులు సు ప్రియ, నాగభూషణం, చీఫ్ సూపరింటెండెంట్ జి.రాంచం ద్రం, వెంకటరమణ తెలిపారు. 6వ తరగతి ప్రవేశాల కోసం 309 మంది విద్యార్థులకు 292 మంది హాజరయ్యారు. 7వ తరగతి కోసం 107 మంది, 8వ తరగతి కోసం 66 మంది, 9వ తరగతి కోసం 13 మంది, 10 తరగతి కోసం ఆరుగురు విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు తెలిపారు.
మిరుదొడ్డిలో..
మిరుదొడ్డి, ఏప్రిల్ 24 : రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతిలో చేరడానికి 5వ తరగతి విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహించారు. పాఠశాలలో 100 సీట్లకు ఉండగా, 195 మంది విద్యార్థులకు పరీక్ష రాయడానికి దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో 187 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.
బెజ్జంకిలో..
బెజ్జంకి, ఏప్రిల్ 24 : మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో 6 నుంచి 10 తరగతి వరకు విద్యార్థుల ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. 6 తరగతి ప్రవేశం కోసం 114 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా, 107 మంది హాజరయ్యారు. 7 నుంచి 10 తరగతి వరకు 32 మంది విద్యార్థులకు 26 మంది పరీక్షకు హాజరైనట్లు ప్రిన్సిపాల్ హర్జిత్కౌర్ తెలిపారు.