సిద్దిపేట కమాన్, ఏప్రిల్ 24 : తెలంగాణ ఉద్యమకారుడు జాన్‌వెస్లీ కూతురు కుపిరాల వివాహం ఆదివారం పట్టణంలోని భైరి అంజయ్య గార్డెన్లో జరిగింది. ఈ వివాహానికి రాష్ట్ర ఆర్థిక, వైద్యఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. మరోవైపు ఆర్ఎస్ మెట్రో గార్డెన్స్‌లో జరిగిన తాళ్ల వారి వివాహానికి, మొకిడి నర్సింహారెడ్డి ఫంక్షన్హాల్లో జరిగిన పెరుడి వారి పెళ్లి వేడుకకు మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు. ఆయన వెంటనే ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
టీఆర్ఎస్వై నాయకుడి వివాహం..
చేర్యాల, ఏప్రిల్ 24 : ఎమ్మెల్సీ తక్కపల్లి రవీందర్రావు పీఆర్వో, టీఆర్ఎస్వై నాయకుడు ఆలేటి రమేశ్ వివాహం ఆదివారం పట్టణంలోని శివప్రసన్న ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ వివాహానికి తెలంగాణ మెడికల్ ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్సీ రాజలింగం, కొమురవెల్లి మల్లన్న ఆలయ మాజీ చైర్మన్ సంపత్, నాగపురి కిరణ్‌గౌడ్ హాజరైన నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారితోపాటు ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్వై, టీఆర్ఎస్వీ నాయకులు వివాహానికి హాజరయ్యారు.
ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు సన్మానం..
తెలంగాణ మెడికల్ ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను మండలంలోని కడవేర్గు గ్రామంలో ఎంపీటీసీ గదరాజు యాదగిరి, టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గదరాజు చందు ఘనంగా సన్మానించారు. రాష్ట్ర చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటిసారి ఓయూ విద్యార్థి నాయకుడు చందు స్వగృహానికి శ్రీనివాస్ రావడంతో ఆయనను సన్మానించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకల పర్వతాలు, నాగపురి కిరణ్‌కుమార్, మంగోలు చంటి, ఆకుల రాజేశ్, తాళ్లపల్లి రమేశ్ పాల్గొన్నారు.