కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రలు : జీడిపల్లి రాంరెడ్డి
కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రలు చేస్తుందని జీడిపల్లి రాంరెడ్డి ఆరోపించారు.
తొగుట , నవంబర్ 3: కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిస్థాయిలో పునరుద్ధరించి రైతులకు సాగునీరు అందించాలని, మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులు పూర్తి చేసి కన్నెపల్లి పంపులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ మేడిగడ్డ నుంచి కొండపోచమ్మ సాగర్ వరకు బీఆర్ఎస్ పెద్దపల్లి పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్‌కుమార్, గోదావరిఖని పట్టణ అధ్యక్షుడు బొడ్డు రవీందర్‌ల ఆధ్వర్యంలో 400 కిలోమీటర్ల మహా సైకిల్ యాత్రకు ఏడవ రోజు తొగుట మండలం వెంకట్రావుపేటలో ఘన స్వాగతం లభించింది. సోమవారం రాత్రి గ్రామానికి చేరుకున్న యాత్ర బృందానికి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి రాత్రి బస, భోజన వసతులు కల్పించి ఆత్మీయ స్వాగతం పలికారు.
మంగళవారం ఉదయం గ్రామంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్, తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం యాత్రికులకు వీరతిలకం దిద్ది, పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి, నాయకులు తదితరులు స్వయంగా సైకిల్ తొక్కుతూ యాత్ర బృందంతో కొంతదూరం ప్రయాణించి సంఘీభావం తెలిపారు. అనంతరం పార్టీ జెండా ఊపి ఏడవ రోజు మహా సైకిల్ యాత్రను ప్రారంభించారు.
ఈ సందర్భంగా జీడిపల్లి రాంరెడ్డి మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజకీయ కక్షతో వ్యవహరిస్తూ కుట్రలు చేస్తోందని విమర్శించారు. బ్యారేజీల పునరుద్ధరణ పనులు చేపట్టకుండా కాలయాపన చేస్తుండటంతో గోదావరి జలాలు వృథాగా సముద్రం పాలవుతున్నాయని, ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.. కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిస్థాయిలో పునరుద్ధరించి రైతులకు సాగునీరు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
కార్యక్రమంలో సర్పంచ్‌లు బండారు కవిత స్వామిగౌడ్, బక్క కనకయ్య, నాయకులు చిలువేరి మల్లారెడ్డి, వేల్పుల స్వామి, మంగ నర్సింలు, చంద స్వామి, తగరం అశోక్, కర్ణాకర్, శివయ్య, రాములు, చంద్రం, బాలయ్య, పర్శయ్య, లక్ష్మణ్ లతో పాటు యాత్ర బృంద సభ్యులు ఉప్పు రాజ్‌కుమార్, బొడ్డు రవీందర్, కాశిపాక వాసు, ఆరెపల్లి సురేష్, ముత్యం లక్ష్మణ్ గౌడ్, పరుపల్లి అనిల్, మేకల నవీన్, గుండబోయిన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తల్లిని, బిడ్డని ఒక్కటి చేసి..ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేటీఆర్
Jobs | అటామిక్ ఎనర్జీలో 254 టీచర్ పోస్టులు.. నవంబర్ 22 చివరితేదీ
Tusshar Kapoor | రూ.5 కోట్లు ఇవ్వకుంటే లేపేస్తాం.. మరో బాలీవుడ్ నటుడికి బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు..!
Abdulla Shahid: చిన్నారిపై లైంగిక వేధింపులు.. మాల్దీవులు మాజీ విదేశాంగ మంత్రి అరెస్టు
AP News | తూర్పుగోదావరి జిల్లాలో కూటమి అభ్యర్థుల హవా.. మూడు వార్డుల్లోనే వైసీపీ ఆధిక్యం..!
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

