Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Gajwel MRO | తమకు బ్రతుకుదెరువును ఇచ్చే వ్యవసాయ భూమి సమస్యను పరిష్కరించాలని తన కార్యాలయానికి వచ్చిన ఓ రైతన్నను గజ్వేల్ ఎమ్మార్వో స్వామి నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా.. పురుగుల మందు తాగలేదా..? అని నవ్వుతూ మాట్లాడి హేళన చేసిన విషయం తెలిసిందే.
Gajwel MRO | నువ్వు ఇంకా చనిపోలేదా అంటూ గజ్వేల్ ఎమ్మార్వో స్వామి తన కార్యాలయానికి వచ్చిన ఓ రైతును అవమానించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన సిద్దిపేట జిల్లా కలెక్టర్ కే హైమావతి ప్రాథమిక విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆర్డీవోను ఆదేశించారు. ఆర్డీవో సమర్పించిన ప్రాథమిక నివేదికలో ఎమ్మార్వో స్వామి ప్రవర్తన నిబంధనలకు విరుద్దంగా ఉన్నట్టు రుజువు కావడంతో అతడిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్స్ విడిచి వెళ్లొద్దని ఎమ్మార్వో స్వామికి ఆదేశాలు కూడా జారీ చేశారు.
తమకు బ్రతుకుదెరువును ఇచ్చే వ్యవసాయ భూమి సమస్యను పరిష్కరించాలని తన కార్యాలయానికి వచ్చిన ఓ రైతన్నను గజ్వేల్ ఎమ్మార్వో స్వామి నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా.. పురుగుల మందు తాగలేదా..? అని నవ్వుతూ మాట్లాడి హేళన చేసిన విషయం తెలిసిందే. సదరు రైతు నా పరిస్థితి చూస్తే మీకు నవ్వు వస్తుందా అని అడిగితే ఆ ఎమ్మార్వో అహంకారంగా అవును వస్తది బరాబర్ వస్తది అని సమాధానం చెబుతున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. జనాల నుంచి ఈ ఘటనపై పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తమవయ్యాయి.
ఈ వీడియోపై ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ.. ఓ బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న ఎమ్మార్వో అన్నదాతను అవహేళన చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసిందే. మనకు అన్నం పెట్టే రైతుల పట్ల ఇలాగేనా ప్రవర్తించేది.. అని కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఒక తోటి మనిషి (రైతు) పట్ల ఆ అధికారి ప్రవర్తించిన తీరు చూస్తుంటే.. వారికి మానసిక సమతుల్యత లోపించిందని చెప్పక తప్పడం లేదు. రైతు పట్ల ఎమ్మార్వో వ్యవహరించిన తీరు అత్యంత సిగ్గు చేటు. ఏమాత్రం ఆమోదయోగ్యం కాని విషయమమన్నారు. ఎమ్మార్వోపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కేటీఆర్ డిమాండ్ చేశారు.
గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
నువ్వు ఇంకా చనిపోలేదా అంటూ రైతును అవమానించిన ఎమ్మార్వో
ఆర్డీవో ప్రాథమిక నివేదిక ఆధారంగా రైతుతో అనుచితంగా మాట్లాడినందుకు చర్యలు
అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్స్ విడిచి వెళ్లొద్దని ఆదేశాలు
ఏదో సరదాకి అన్నానన్ని, ఆరు నెలల క్రితం వీడియో వైరల్ చేస్తున్నారని బుకాయించే ప్రయత్నం చేసిన ఎమ్మార్వో
— Telugu Scribe (@TeluguScribe) October 11, 2026
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

