హుస్నాబాద్ టౌన్: కరోనా లాంటి విపత్కర పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు 30శాతం ఫిట్మెంట్ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందని ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి అన్నారు. పట్టణంలో పీఆర్టీయు అసోసియేట్ అధ్యక్షుడు కాయిత శ్రీనివాసరెడ్డి కుమారుడి వివాహానికి బుధవారం ఆయన హాజరై నూనత వధూవరులను ఆశ్వీరించారు.
అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 72 రకాల అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో పాటు ఉపాధ్యాయు లకు వచ్చే నెల నుంచి 30శాతం ఫిట్మెంట్ ఇచ్చేలా ప్రభు త్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. 19మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలను ఎట్టి పరిస్థితుల్లో కొనసాగిస్తామని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం అభినందనీయమని ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి చెప్పారు.
ఉపాధ్యాయుల సమస్యలపై పీఆర్టీయూ 50ఏండ్లుగా అలు పెరగని పోరాటం చేస్తున్నదని, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించే సత్తా ఉన్న సంఘం పీఆర్టీయూదేనన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పీఆర్టీయూ హుస్నా బాద్ మండల అధ్యక్షుడు బూట్ల రాజమల్లయ్య, ప్రధాన కార్యదర్శి పంజా రాజమల్లు ఎమ్మెల్సీని ఘనంగా సన్మానించారు.
సమావేశంలో పీఆర్టీయూ నాయకులు లావుడ్యా కిషన్‌నాయక్, కేతిరి జీవన్‌రెడ్డి, దుబ్బాక బాల్‌రెడ్డి, కొమురయ్య, నాగేశ్వర్రావు, బండారి మనీల, రిటైర్డ్ ఉపాధ్యాయులు మాధవరెడ్డి, వీరసోమయ్య, సత్యనారాయణ రెడ్డి, దేవేందర్‌రెడ్డి, రాజ మల్లయ్యతో పాల్గొన్నారు.