MLA Kotha Prabhakar Reddy | కేసీఆర్ హయాంలోనే దుబ్బాక నియోజకవర్గం సస్యశ్యామలం : ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
MLA Kotha Prabhakar Reddy | ఇవాళ దౌల్తాబాద్ మండలంలోని దొమ్మాట, గాజులపల్లి గ్రామాల్లో మెయిన్ కెనాల్ కాల్వ ద్వారా రెండు గ్రామాల ప్రజలు సొంత డబ్బులతో పిల్ల కాలువలను జేసీబీ ద్వారా నిర్మించుకొని చెరువులు నింపుకోవడం అభినందనీయమన్నారు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి .
MLA Kotha Prabhakar Reddy | రాయపోల్, ఏప్రిల్ 03 : తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హయాంలోనే దుబ్బాక నియోజకవర్గం సస్యశ్యామలం చెందిందని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పిల్ల కాలువలు కూడా చేపట్టడం లేదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు.
ఇవాళ దౌల్తాబాద్ మండలంలోని దొమ్మాట, గాజులపల్లి గ్రామాల్లో మెయిన్ కెనాల్ కాల్వ ద్వారా రెండు గ్రామాల ప్రజలు సొంత డబ్బులతో పిల్ల కాలువలను జేసీబీ ద్వారా నిర్మించుకొని చెరువులు నింపుకోవడం అభినందనీయమన్నారు.
స్వయంగా రైతులే జేసీబీల ద్వారా..
ప్రభుత్వం చేయాల్సిన పనిని రైతులు ముందుకు వచ్చి సొంత డబ్బులతో మెయిన్ కెనాల్ ద్వారా పిల్ల కాలువతో చెరువులు నింపుకొని పంటలు పండించుకోవడానికి భగీరథ ప్రయత్నం చేయడం పట్ల ఆయన రైతులను అభినందిస్తూ పటేల్ కుంట, పెద్ద చెరువు, కుమ్మరి కుంట, కన్నె కుంటల మత్తడిల వద్ద కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో మల్లన్న సాగర్ నిర్మించడంతో దుబ్బాక నియోజకవర్గంలో లక్ష 30 వేల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా మల్లన్న సాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టు ద్వారా మెయిన్ కెనాల్ నిర్మించి రైతులకు సాగునీరు అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు.
రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ పెద్ద కాలువలు నిర్మించారని.. మండే ఎండలో చెరువులు అలుగు పారాయని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం మెయిన్ కెనాల్ నుంచి చిన్న కాలువలు తీయడంలో ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో స్వయంగా రైతులే జేసీబీల ద్వారా చేసుకుంటున్నట్లు ఇదే విషయాన్ని అసెంబ్లీలో కూడా ప్రస్తావించినట్లు ఆయన గుర్తు చేశారు.
రామాయంపేట్ కెనాల్, శంకరంపేట కెనాల్, దుబ్బాక కెనాల్, సంగారెడ్డి కెనాల్ నుండి నీళ్లు వదిలితే యాసంగి వరి పంటలు పండేవని.. పిల్ల కాలువలు మరమ్మత్తు లేక చాలా ప్రాంతాల్లో వేసిన పంటలు ఎండిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
మల్లన్న సాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టుల ద్వారా మెయిన్ కెనాల్ నుంచి అన్ని గ్రామాలకు పిల్ల కాలువలు నిర్మించి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలపై తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నామని ఆ దిశగా ప్రభుత్వం కృషి చేయాలన్నారు.
రైతులకు సన్మానం..
కాగా దొమ్మాట, గాజులపల్లి గ్రామాల్లోని చెరువుల్లోకి నీళ్లు రావడానికి ఎంతో కృషి చేసిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిని ఆయా గ్రామాల రైతులు శాలువాతో సన్మానించారు. రైతులు కష్టపడి చెరువుల్లోకి సొంత డబ్బులతో నీరు తెచ్చుకోవడాన్ని అభినందిస్తూ దొమ్మాట తాజా మాజీ సర్పంచ్ పూజిత వెంకటరెడ్డి, గాజులపల్లి తాజా మాజీ సర్పంచ్ అప్ప వారు శ్రీనివాస్‌లను ఎమ్మెల్యే సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు. నాయకులు. తదితరులు పాల్గొన్నారు.
Read Also :
Pooja Hegde | శ్రీకాళహస్తీ రాహుకేతు పూజలో పాల్గొన్న పూజా హెగ్డే
A Raja: బొట్టు పెట్టుకోవద్దు.. కంకణం కట్టుకోవద్దు.. డీఎంకే నేత ఏ రాజా వివాదాస్పద వ్యాఖ్యలు
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘నేను ఇక్కడే ఉన్నా, నన్ను అరెస్ట్ చేయండి’.. లుకౌట్ నోటీస్‌పై అభిజిత్ దిప్కే
Tragedy | ఘోరం.. ఇనుపకడ్డీలు మీదపడి డిగ్రీ విద్యార్థిని మృతి
AP Cabinet | ఏపీ కేబినెట్ కీలక అంశాలకు ఆమోదం.. పెనుకొండలో కియా ప్లాంట్-2కు పచ్చ జెండా
Samsung | గెలాక్సీ ఏఐకి కొత్త ప్రైవేట్ క్లౌడ్ సెక్యూరిటీ.. శాంసంగ్ కీలక ప్లాన్..
Piyush Goyal | భారత్-అమెరికా ట్రేడ్ డీల్ తుదిదశకు చేరింది : పీయూష్ గోయెల్
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

