MLA Kotha Prabhakar Reddy | పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు పరితపించిన వ్యక్తి అంబేద్కర్ : ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
MLA Kotha Prabhakar Reddy | ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంబేద్కర్ రాజ్యాంగంతో పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు పరితపించిన మహానుభావుడని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కొనియాడారు. ఇవాళ దౌల్తాబాద్ మండలంలోని ముబారస్ పూర్ చౌరస్తాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి ఆవిష్కరించారు.
MLA Kotha Prabhakar Reddy | రాయపోల్, ఏప్రిల్ 13 : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చూపిన అడుగుజాడల్లో నడుస్తూ ముందుకు సాగాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఇవాళ దౌల్తాబాద్ మండలంలోని ముబారస్ పూర్ చౌరస్తాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంబేద్కర్ రాజ్యాంగంతో పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు పరితపించిన మహానుభావుడని కొనియాడారు.
ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం పోరాడిన మేధావి అంబేద్కర్ అని అన్నారు. ఆయన అడుగుజాడల్లో నడవాలని సామాజిక అభివృద్ధికి పాటుపడాలని కోరారు. బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం దేశ భవిష్యత్తుకు దిక్సూచిగా మారిందన్నారు. సమాజంలోని సామాజిక అసమానతలను తొలగించి అణగారిన వర్గాలకు సమన్యాయం అందించాలనే లక్ష్యంతో అంబేద్కర్ భారత రాజ్యాంగంలో అనేక అంశాలకు చోటు కల్పించారన్నారు.
మాజీ సీఎం కేసీఆర్ దేశానికి స్ఫూర్తిగా హైదరాబాద్ నడిబొడ్డులో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే ప్రభుత్వం సంకెళ్లు వేయడం సరికాదని, నేడు అంబేద్కర్ జయంతి సందర్భంగా నిషేధం విధిస్తే సంకెళ్లు బద్దలు కొట్టి జయంతిని ఘనంగా నిర్వహిద్దమన్నారు. అక్షరమే ఆయుధంగా ఉన్నత శిఖరాలను అధిరోహించిన విద్యా కుసుమం అసమానతలు, అంటరానితనం నిర్మూలనకై అహర్నిశలు పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త అంబేద్కర్ అని కొనియాడారు.
తరతరాల భవిష్యత్తుకై రాజ్యాంగం ద్వారా బలమైన పునాది వేసిన అంబేద్కర్ స్ఫూర్తితో మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ప్రగతి కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశారని అన్నారు. కేసీఆర్ దళిత బంధు పథకం మండలంలోని మహమ్మద్ షాపూర్ గ్రామంలో ఏర్పాటు చేశామని, దళితుల జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం కేసీఆర్ చేశారని అన్నారు.
రేవంత్ ప్రభుత్వం ఇప్పటికైనా పథకాన్ని అమలు చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విగ్రహ దాత స్వామి, డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్, పీఏసీఎస్ చైర్మన్ వెంకటరెడ్డి, తాజా మాజీ సర్పంచ్ యాదగిరి, అంబేద్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు.
Read Also :
Rollavagu project | రోళ్లవాగు ప్రాజెక్ట్ కు గేట్లు బిగించక వృథాగా పోతున్న నీరు
IPL 2025 | సెంచరీ హీరో అభిషేక్ శర్మకు వెల్లువెత్తిన అభినందనలు.. గురువు యువరాజ్ ఏమన్నాడంటే..?
Pawan Kalyan | హైదరాబాద్కి వచ్చాక తొలిసారి కొడుకు ఆరోగ్యంపై స్పందించిన పవన్ కళ్యాణ్
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
‘కోదాడ నియోజకవర్గంలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి’
Vishvajit More | వరల్డ్ ఛాంపియన్షిప్స్లో రజతం.. చరిత్ర సృష్టించిన యువ రెజ్లర్..!
BSF camp | బీఎస్ఎఫ్ క్యాంప్లో ఫుడ్ పాయిజనింగ్.. 75 మంది సిబ్బంది ఆస్పత్రిపాలు
‘రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ కోతలు – ఎండిపోతున్న పంటలు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

