మద్దూరు (ధూళిమిట్ట): ఇటీవల సిద్దిపేటలో సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సెలక్షన్స్లో పాల్గొని ప్రతిభ కనబరిచిన సుమేరా, మేఘన, హర్షిని, భావన రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనుముల కరుణాకర్ రెడ్డి తెలియజేశారు. విద్యార్థులు రేపటినుండి నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లి లో జరిగే 11వ సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొంటారని చెప్పారు.
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థినులను, పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ వెగ్గళం సతీష్ కుమార్ ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు, గ్రామ సర్పంచ్, పాలకవర్గం ,ఉపాధ్యాయ బృందం మరియు గ్రామస్తులు అభినందించారు.