రాయపోల్, ఎప్రిల్ 28 : సిద్దిపేట జిల్లా రాయపోల్ మాజీ ఎంపీటీసీ దత్తా రెడ్డి మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర భాషా సంస్కృతిక సలహాదారు దరువు అంజన్న తీవ్ర విచారణ వ్యక్తం చేశారు. దత్త రెడ్డి గుండె పోటుతో మరణించడం ఎంతో బాధాకరమని ఆయన అన్నారు. మండల కేంద్రంలోని దత్తా రెడ్డి నివాసానికి వెళ్లిన ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
దత్తా రెడ్డి 1995 సంవత్సరంలో రాయపోల్ తొలి ఎంపీటీసీగా గెలుపొంది ప్రజలకు నిస్వార్ధంగా సేవలు అందించిన విషయాన్ని దరువు అంజన్న ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తాను రాయపోల్ గ్రామంలో చదువుకున్నప్పుడు దత్తా రెడ్డి మంచి ప్రోత్సహం కల్పించేవారని చెప్పారు. గ్రామ అభివృద్ధిలో అందరిని కలుపుకుపోయి అభివృద్ధి, సంక్షేమ పథకాలు నిరుపేదలకు అందే విధంగా కృషి చేసిన దత్తా రెడ్డి మృతి బాధాకరమని అంజన్న తెలిపారు. ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేసిన అంజన్న కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంజన్న వెంట బీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకులు రాజిరెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు ఉన్నారు.