సిద్దిపేట, మార్చి 11 : సీఎం కేసీఆర్ ట్రోపీ సీజన్ -2లో భాగంగా పట్టణంలోని ఆచార్య జయశంకర్ స్టేడియంలో జరుగుతున్న క్రికెట్ పోటీలలో ఆయా జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లతో తొలి రౌండ్ పోటీలు పూర్తయ్యాయి. మొత్తం 259 జట్లు తలపడగా 130 జట్లు గెలుపొందాయి.
గెలుపొందిన జట్లకు రెండో రౌండ్ మ్యాచ్‌లకు సంబంధించి షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు.
కాగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌ల్లో చార్వదాన్ స్ట్రైకర్స్ జట్టు పై సలీం టీమ్, సిద్దిపేట క్రికెట్ క్యాంప్ జట్టు పై స్టార్ క్రికెట్ క్లబ్, ఇబ్రహీంనగర్ జట్టుపై లక్ష్మిదేవిపల్లి ఎంపీటీసీ జట్టు విజయం సాధించగా, శుక్రవారం ఉదయం జరిగిన మ్యాచ్‌ల్లో బద్దిపడగ జట్టు పై కొండంరాజుపల్లి జట్టు, భారత్‌నగర్ ఎస్ఆర్హెచ్ టీమ్ -బి పై కేటీఎల్ కింగ్స్ జట్లు విజయం సాధించాయి.
ఆయా జట్లలో ఉత్తమ ప్రతిభ చూపిన ఆటగాళ్లకు నిర్వాహకులు మ్యాన్ ఆప్ ది మ్యాచ్ అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో నిర్వాహకులు మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, కలకుంట్ల మల్లికార్జున్, ఎడ్ల సోంరెడ్డి, శేషు, కుంభాల ఎల్లారెడ్డి, రమేశ్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.