లోక్‌సభ బరిలో 130 మంది
ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోకి వచ్చే మెదక్,జహీరాబాద్,కరీంనగర్,భువనగిరి పార్లమెంట్ స్థానాల్లో 130 మంది బరిలో నిలిచారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు పోటీ చేస్తున్నారు.
- మెదక్‌లో 44 మంది, జహీరాబాద్‌లో 19 మంది
- కరీంనగర్లో నుంచి 28మంది, భువనగరిలో 39 మంది అభ్యర్థులు
- ముమ్మర ప్రచారం చేస్తున్న అభ్యర్థులు
సిద్దిపేట, మే 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోకి వచ్చే మెదక్,జహీరాబాద్,కరీంనగర్,భువనగిరి పార్లమెంట్ స్థానాల్లో 130 మంది బరిలో నిలిచారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు పోటీ చేస్తున్నారు. మెదక్ పార్లమెంట్ స్థానంలో 44 మంది, జహీరాబాద్ పార్లమెంట్ స్థానంలో 19 మంది, కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో 28 మంది, భువనగరి పార్లమెంట్ స్థానంలో 39 మంది పోటీలో ఉన్నారు.
అత్యధికంగా మెదక్ ఎంపీ స్థానంలో అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈనెల 13న జరిగే పోలింగ్‌లో వారి భవిష్యత్తు తేలనున్నది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్రులు బరిలో నిలువడంతో వారికి గుర్తులు కేటాయించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.
మెదక్ పార్లమెంట్..
మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి 44 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో ప్రధాన పార్టీల అభ్యర్థులైన బీఆర్ఎస్ నుంచి వెంకట్రామిరెడ్డి, బీజేపీ నుంచి రఘునందన్ రావు, కాంగ్రెస్ నుంచి నీలం మధు బరి లో ఉన్నారు. మిగతా ఇతర పార్టీలకు చెందిన వారితో పాటు స్వతంత్రులు రంగంలో ఉన్నారు.
ఒక ఈవీఎంలో గరిష్టంగా 16 మంది అభ్యర్థుల పేర్లు, ఫొటో, పార్టీ పేరు, గుర్తు వివరాలు ఉంటాయి. ఈ నియోజకవర్గంలో మూడు ఈవీఎంలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్థానం నుంచి బీఆర్ఎస్ వరుస విజయాలు సాధిస్తూ వస్తుంది. వరుసగా ఐదుసార్లు విజయం సాధించింది. డబుల్ హ్యాట్రిక్ దిశగా బీఆర్ఎస్ అభ్యర్థి దూసుకుపోతున్నారు.
జహీరాబాద్ పార్లమెంట్ స్థానం..
జహీరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి 19 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్ నుంచి గాలి అనిల్‌కుమార్, బీజేపీ నుంచి బీబీపాటిల్, కాంగ్రెస్ నుంచి సురేశ్‌కుమార్ షెట్కార్ బరిలో ఉన్నారు. ఇక్కడ వరుసగా బీఆర్ఎస్ రెండుసార్లు విజయం సాధించింది. హ్యాట్రిక్ విజయం కోసం బీఆర్ఎస్ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నది. 19 మంది బరిలో ఉండడంతో అధికారులు రెండు ఈవీఎంలు ఏర్పాటు చేయనున్నారు.
కరీంనగర్ పార్లమెంట్ స్థానం..
కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో 28మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. బీఆర్ఎస్ నుంచి మాజీఎంపీ బోయిన్పల్లి వినోద్‌కుమార్, బీజేపీ నుంచి సిట్టింగ్ ఎం పీ బండి సంజయ్, కాంగ్రెస్ నుంచి వెలిచాల రాజేందర్రావు బరిలో ఉన్నారు. ఇక్కడ రెండు ఈవీఎంలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఒక ఈవీఎంలో గరిష్టంగా 16 మంది అభ్యర్థుల పేర్లు ఉంటాయి. దీంతో కరీంనగర్లో 28 మంది అభ్యర్థులు ఉండడంతో అధికారులు రెండు ఈవీఎంలను ఏర్పాటు చేయనున్నారు.
భువనగిరి పార్లమెంట్..
భువనగిరి పార్లమెంట్ స్థానంలో మొత్తం 39 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక్కడ ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లేశ్, కాంగ్రెస్ నుంచి చామ ల కిరణ్‌కుమార్ రెడ్డి, బీజేపీ నుంచి బూర నర్సయ్య గౌడ్ బరిలో ఉన్నారు. వీరితోపాటు ఇక్కడ సీపీఎం అభ్యర్థి కూడా రంగంలో ఉన్నారు. నువ్వానేనా అన్నట్లు ప్రచారం ముమ్మరంగా జరుగుతుంది. ఈ నియోజకవర్గంలో అధికారులు మూడు ఈవీఎంలు ఏర్పాటు చేయనున్నారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

