సిద్దిపేట, సెప్టెంబర్ 6: సకల కార్యక్రమాలకు ముం దు ప్రథమంగా పూజించేది వినాయకుడిని.. వినాయక చవితి పర్వదినాన్ని ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీ రు హరీశ్‌రావు కోరారు. వినాయక చవితి సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
విఘ్నేశ్వరుడి దయతో విఘ్నాలు తొలిగిపోవాలని, ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒ క్కరూ మట్టి గణపతి ప్రతిమలను పూజించాలన్నారు. మట్టి గణపతే మహాగణపతి అన్నారు.