సిద్దిపేట, ఆగస్టు 17 : ఊపిరి ఉన్నంత వరకు సిద్దిపేట ప్రజలకు సేవ చేస్తానని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నా రు. సిద్దిపేట పట్టణంలోని ఎన్జీవో భవన్లో ఉద్యోగ విరమణ పొందిన జీవిత సభ్యులకు, టెన్త్‌లో టాపర్‌గా నిలిచిన విద్యార్థులకు శనివారం జ్ఞాపికలు, మెడల్స్ అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట అభివృద్ధికి మారుపేరని, పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కీర్తి ప్రతిష్టను పెంచామన్నారు. కరోనా సమయంలో సిద్దిపేట ప్రజల ను కుటుంబ సభ్యుల్లాగా కాపాడుకున్నామని, ఏనాడూ అరాచకాలకు పాల్పడలేదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడం లేదన్నారు. సిద్దిపేటలో అభివృద్ధి పనుల నిధులను రద్దుచేసి కొడంగల్‌కు తీసుకువెళ్తున్నారన్నారు. ఎన్జీవో భవన్‌తో తనకు 21 ఏండ్ల అనుబంధం ఉందన్నారు. సిద్దిపేట ఎన్జీవో భవన్ రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. టెన్త్‌లో ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థులకు అల్పాహారంతోపాటు ట్యాబ్‌లు సైతం అందించామన్నారు. ఈ ఏడాది టెన్త్ ఫలితాల్లో రాష్ట్రంలోనే సిద్దిపేట జిల్లా రెం డో స్థానంలో నిలిచిందన్నారు. 75 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు 10/10 జీపీఏ సాధించారన్నారు.
169 మంది విద్యార్థులు బాసర ట్రిఫుల్ ఐటీలో సీట్లు సాధించి రాష్ట్రంలోనే సిద్దిపేట మొదటి స్థానంలో నిలిచిందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, యాదవ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్హుస్సేన్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, ఎన్జీవో భవన్ నాయకులు విక్రంరెడ్డి, కల్లేపల్లి శ్రీనివాస్, అంజయ్య, స్థానిక కౌన్సిలర్ సాయిశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.