
చేగుంట, జూలై 17 : పేదల అభివృద్ధే లక్ష్యంగా ప్రభు త్వం కృషి చేస్తున్నదని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. నార్సింగి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో శనివారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఎం పీపీ చిందం సబిత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మం డల సర్వసభ్య సమావేశంలో ఎంపీ, ఎమ్మెల్యే పాల్గొన్నారు. నార్సింగిలోని ప్రభుత్వ దవాఖానను తనిఖీ చేసి రోగులకు అందుతున్న సేవలపై డాక్టర్ రాకేశ్‌ను అడిగి తెలుసుకున్నారు. నార్సింగిలోని చంద్రారెడ్డి గార్డెన్లో జరిగిన కార్యకర్తల సమావేశంలో పాల్గొని కార్యకర్తలు, పల్లె ప్రగతి, హరితహారంలో చేపట్టాల్సిన పలు అంశాలను కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ చిందం సబిత, జడ్పీటీసీ బాణపురం కృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ దొబ్బల సుజాత, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎన్నం రాజేందర్‌రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు అశో క్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తౌర్యనాయక్, నార్సింగి సొసైటీ చైర్మన్ శంకర్‌గౌడ్, రెడ్డిపల్లి చైర్మర్ పరమేశ్, ఎంపీడీవో ఆనంద్మేరి, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.
బ్రిడ్జిల ఏర్పాటుకు రూ.50కోట్ల నిధులు మంజూరు..
చేగుంట, జూలై 17: మెదక్ జిల్లా పరిధిలోని చేగుంట, నార్సింగితో పాటు ప్రమాదకరంగా ఉన్న రహదారుల్లో అండర్ గ్రౌండ్ బిడ్జిల నిర్మా ణానికి సుమారు రూ.50 కోట్ల నిధులు మంజూరైట్లు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. శనివారం మండలంలోని రెడ్డిపల్లి బైపాస్ వద్ద ప్రమాదకరంగా ఉన్న రహదారి వద్ద ఎంపీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, జీఎంఆర్, నేషనల్ హైవే అథారాటీ, ఫారె స్టు, ఆర్టీసీ అధికారులతో కలిసి పరిశీలించారు. వారి వెంట రామాయంపేట సీఐ నాగార్జునగౌడ్, చేగుంట ఎస్సై సుభాష్‌గౌడ్, జీఎంఆర్ ఇంజినీర్ నాగేశ్వర్రావు, ప్రాజెక్టు మేనేజర్ రాజేంద్రప్రసాద్, మెదక్ ఆర్టీవో క్రిస్టోఫర్‌తో పాటు పలువురు అధికారులు ఉన్నారు.