సీఎం కేసీఆర్ ఆలోచనల నుంచి ఏర్పాటైన ములుగు ఉద్యానవన వర్సిటీ అచిరకాలంలోనే దేశంలో గొప్ప విద్యాసంస్థగా పేరుగాంచింది. పంటల ప్రయోగాలకు కేంద్రంగా మారింది. ఆధునిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం రెండో స్నాతకోత్సవం నేడు జరగనున్నది. సీఎం కేసీఆర్ ఈ ఉద్యాన వర్సిటీని నెలకొలిపి దేశంలోనే గొప్ప విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా తీర్చిదిద్దారు. వీసీగా డాక్టర్ నీరజా ప్రభాకర్‌ను నియమించి దేశంలోనే తొలి మహిళా ఉపకులపతిగా అవకాశం కల్పించారు. విద్యా, పరిశోధన, విస్తరణ రంగాల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తూ దేశంలో గొప్ప వర్సిటీగా గుర్తింపును సాధించింది.
ములుగు, డిసెంబర్ 22 : ముఖ్యమంత్రి కేసీ ఆర్ ఉద్యానవన శాఖకు కొత్త ఊపిరిలూది పసిడి పంటల నూతన ప్రయోగాలకు నాంది పలికేలా విస్తృత స్థాయిలో ఆధునిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం విజయవంతంగా 2వ స్నాత కోత్సవానికి ముస్తాబైంది. యూనివర్సిటీ ఉపకు ల పతిగా డాక్టర్ నీరజా ప్రభాకర్‌ను నియమించి, దేశంలోనే తొలి మహిళా ఉపకులపతిని నియమిం చిన ఘనత సీఎం కేసీఆర్ సొంతం చేసుకున్నారు. విద్యా, పరిశోధన, విస్తరణ రంగాల్లో మెరుగైన ఫలితాలను సాధిస్తూ దేశంలోనే అరుదైన రికా ర్డులను కైవసం చేసుకొని అనతికాలంలోనే గొప్ప గుర్తింపు సాధించింది సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వ విద్యాలయం.
2014లో విశ్వవిద్యా లయం వేగం గా నిర్మాణం పూర్తి చేసుకొని సీఎం చేతుల మీదు గా ప్రారంభమైంది. నేటికి రెండు విద్యా సంవత్స రాలను పూర్తి చేసుకొని, నేడు 575మంది విద్యా ర్థులకు పట్టాలను అందించేందుకు సిద్ధమైంది. ఇందులో 482 అండర్ గ్రాడ్యుయేట్, 76 పోస్ట్ గ్రాడ్యుయేట్, 17మందికి పీహెచ్డీ పట్టాలను అందజేయనున్నారు. వీరిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 11మందికి గోల్డ్‌మెడల్‌ను ప్రదానం చేయనున్నారు. దీనికి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, భారతవ్యసాయ పరిశోధన మండలి, ఐసీఏఆర్ ఉద్యాన విభాగం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆనంద్‌కుమార్ సింగ్ రానున్నారు.
విజయం వైపుగా విద్యార్థులు
కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వ విద్యాలయం పరిధిలోని రాజేంద్రనగర్, మోజెర్ల, కళాశాలలోని అండర్ గ్రాడ్యువేట్, ఎమ్మెస్సీ, పీహె చ్‌డీ ప్రోగ్రామ్‌లలో దేశంలోని ప్రతిష్టాత్మక భార తీయ వ్యవసాయ పరిశోధన మండలి(ఐసీఏఆర్) అక్రిడిటేషన్ సాధించింది. 2021 మార్చి 28 నుంచి 2026 మార్చి 27 వరకు ఈ అక్రిడిటేషన్ గుర్తింపు ఉండనున్నది. విశ్వవిద్యాలయ పరిధిలో ని కళాశాలలో చదివిన విద్యార్థులు 66 జేఆర్ఎఫ్ సీట్లు, 7ఎస్ఆర్ఎఫ్ సీట్లు పొందారు. 2021లో 31మంది విద్యార్థులు దేశంలోని వివిధ విశ్వ వి ద్యాలయాల్లో సీట్లు పొందగా, 8జేఆర్ఎఫ్లు, 23 నాన్ జేఆర్ఎఫ్ సీట్లు సాధించారు. 2022 సంవ త్సరానికి 8 ఎస్‌ఆర్‌ఎఫ్‌లు, 23 జేఆర్ఎఫ్ సీట్లు వర్సిటీ విద్యార్థులు సాధించారు. అంతేకాకుండా హార్టికల్చర్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ, పీహెచ్డీ పూర్తి చేసిన విద్యార్థులు దేశంలోని అరుదైన విశ్వ విద్యాలయాల్లో ఉన్నత చదువులకు సీట్లను సొం తం చేసుకున్నారు.
వర్సిటీ సేవలకు గుర్తింపు
వర్సిటీ చట్ట సవరణ ద్వారా అటవీ కళాశాల, పరిశోధన సంస్థకు, హార్టికల్చర్ పాలిటెక్నిక్‌లకు అఫిలియేషన్ ఇచ్చారు. భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి నుంచి జాతీయ స్థాయి కృషి కర్షక్ ఇన్స్పైరింగ్ లీడర్షిప్ అవార్డును సొంతం చేసుకుంది. 2022లో రఘోత్తంరెడ్డి మెమోరియ ల్ లెక్చర్‌లో హార్టికల్చర్ సెక్టార్లో ఔట్‌స్టాండింగ్ పర్ఫమెన్స్ అవార్డు అందింది. కేవీకే దత్తత గ్రా మాలైన మంథని మండలం నాగారం ముత్తారం మండలం హరిపురం గ్రామాలకు 2020-2021కు దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తీకరన్ పురస్కార్ అవార్డు లభించాయి.
ఉన్నత లక్ష్యం దిశగా కార్యాచరణ
ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని ఉన్నత లక్ష్యం దిశగా నడిపేందుకు కార్యాచరణ రూపొందించాం. విద్యార్థులకు దేశంలోనే అధునాతన పద్ధతుల్లో విద్యాబోధన జరుపుతున్నాం. నూతన ఒరవడికి శ్రీకారం చుట్టేలా వర్సిటీ పరిశోధనలు జరుపుతోంది. వర్సిటీ ఉపకులపతిగా నన్ను నియమించి దేశంలోనే తొలి మహిళా వీసీ నియామకం చేపట్టిన వర్సిటీగా కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం గుర్తింపు పొందడం గర్వంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు. ఈ ఘనత ఆయనకే సొంతం.
– డాక్టర్ నీరజా ప్రభాకర్, ఉపకులపతి, ములుగు అటవీ విశ్వవిద్యాలయం