జగదేవ్‌పూర్ ఆగస్టు 4: జగదేవ్‌పూర్‌లోని కే జీబీవీ పాఠశాలను అన్నివిధాలుగా అభివృ ద్ధి చేస్తామని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వెంకట్‌నర్సింహారెడ్డి అన్నారు. ఆదివా రం జగదేవ్‌పూర్‌లోని కేజీబీవీ పాఠశాలను డీఈవో శ్రీనివాస్‌రెడ్డితో కలసి తనిఖీ చేశా రు. పాఠశాల పరిసరాలు, తరగతి గదులను పరిశీలించి విద్యార్థినులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.
ప్రహరీ లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని విద్యార్థినులు తెలుపగా, ప్రహరీ నిర్మాణానికి కావాల్సిన నిధులు ఇవ్వనున్నట్లు తెలిపారు. కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి కేజీబీవీ అభివృద్ధి పనులు చేపట్టాలని ఆదేశించారు. ఐఎఫ్‌పీ ప్యానల్స్ పరిశీలించి ఎందుకు నడవడం లేదని తెలుసుకున్నారు. కనెక్షన్ ఇవ్వలేదని సూచించడంతో వెంటనే ప్యానల్స్ ఆన్ అయ్యేలా చూ డాలన్నారు. కిచెన్ షెడ్ స్టోర్ రూమ్‌ను పరిశీలించారు. సరిపడా బెంచీలు లేవని విద్యార్థినులు తెలుపడంతో మరిన్ని ఏర్పాటు చేస్తామన్నారు.
కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయాలని, సోలార్ వాటర్ సిస్టం వాడాలని, టాయిలె ట్స్ శుభ్రంగా ఉంచాలని ఎస్వోకు ఆదేశించారు. పాఠశాల అభివృద్ధికి నిధులు ఇస్తామ ని, వెంటనే పనులు ప్రారంభించి పూర్తి చే యాలని అమ్మఆదర్శ కమిటీ చైర్మన్‌కు సూ చించారు. ఆయనకు ఎంఈవో ఉదయభాస్కర్‌రెడ్డి, పాఠశాల ఎస్వో ఉమామహేశ్వరి స్వాగతం పలికారు. కార్యక్రమంలో కేజీబీవీ జీసీడీవో ముక్తేశ్వరి, పీఆర్టీయూ నాయకులు శశిధర్‌శర్మ, శేఖర్, లింగం, నాగరాజు ఎంఐఎస్ గోవర్ధన్, సీఆర్పీ దయానంద్ ఉన్నారు.