Sangareddy | కొండాపూర్, మార్చి30: ఆడపిల్ల పుట్టిందా ఆ ఊరంతా పండుగే.. హరిదాస్పూర్ గ్రామం ఆ పండుగకు వేదికైంది. ఆడపిల్ల పుట్టిందని తెలియగానే బాధపడేవాళ్లుంటారు. మగ పిల్లాడు పుట్టలేదని నిట్టూర్చే వాళ్లు లేకపోలేరు. కానీ ఆ హరిదాస్పూర్ గ్రామం అందుకు భిన్నం. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని హరిదాస్పూర్ గ్రామవాసులు ఆడబిడ్డలు పుట్టగానే సంబురాలు జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఈ పల్లెలో మొత్తం 816 మంది నివసిస్తున్నారు. లింగ నిష్పత్తిలో అంతరం ఎక్కువగా ఉంది. దీంతో గ్రామ పెద్దలు ఆడపిల్లలు కన్న వారిని ప్రోత్సహించాలని నిర్ణయించారు. ఏడాదిలో 10 మంది ఆడపిల్లలు జన్మించిన నేపథ్యంలో సర్పంచ్ ఎండీ షఫీ, పంచాయతీ కార్యదర్శి రోహిత్, పాలకవర్గం, మహిళలు, గ్రామస్తులు పంచాయతీ కార్యాలయం వద్ద విద్యుద్దీపాలతో ఆలంకరించి, సంబురాలు చేసుకున్నారు. ఆడపిల్లల తల్లిదండ్రులను పిలిచి ఘనంగా సన్మానించారు. 89 మంది ఆడపిల్లలకు సుకన్య సమృద్ధి యోజన పథకం కింద పేర్లు నమోదు చేయించి, ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున తొలి ఐదు నెలల మొత్తన్ని వారి ఖాతాలో జమచేశారు. చిన్న పిల్లల సంరక్షణ, ఆడపిల్లల కోసం వినూత్న కార్యక్రమాలు చేస్తున్నందుకు ఫ్రెండ్లీ చైల్డ్ పంచాయతీ రాష్ట్ర స్థాయి అవార్డు లభించింది. గ్రామ సర్పంచ్ ఎండీ షఫీని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.
పదేండ్లలోపు 89 మం ది ఆడపిల్లలకు సుకన్య సమృద్ధి యోజ న పథకం కింద పేర్లు న మోదు చేయించడంతో పాటు ఒకొక్కరికి రూ.1000 చొప్పున వారి ఖాతాలో నగ దు జమ చేశాం. గ్రామంలో ఆడపిల్లలు పుడితే, వారిని కన్న వారిని కూడా ప్రోత్సహించాలని నిర్ణయించాం. ఏడాదిలో 10 మంది ఆడపిల్లలు పుట్టిన నేపథ్యంలో పాలకవర్గం, మహిళలు, గ్రామస్తులు, యువకులు పంచాయతీ కార్యాలయం వద్ద సంబురాలు చేసుకున్నాం. ఆడపిల్లల తొట్టెల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.
– ఎండీ షఫీ, సర్పంచ్, హరిదాస్పూర్