ప్రభుత్వం ముందు చూపు లేకనే రైతులకు ఇబ్బందులు : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
గతంలో ధాన్యం కొనుగోల సమయంలో ప్రభుత్వం ముందు చూపు లేక రైతులు అనేక సమస్యలకు గురయ్యారని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆరోపించారు.
హత్నూర, అక్టోబర్ 26 : గతంలో ధాన్యం కొనుగోల సమయంలో ప్రభుత్వం ముందు చూపు లేక రైతులు అనేక సమస్యలకు గురయ్యారని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆరోపించారు. సోమవారం సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలో పలు గ్రామాలలో ఐకెపి, పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేపట్టే సమయంలో తీసుకోవలసిన చర్యలను సరైన సమయంలో తీసుకోకపోవడంతో రైతులు అనేక సమస్యలకు గురయ్యారని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు దాన్యం తీసుకువచ్చి రోజులు గడిచిన కొనుగోలు చేయకపోవడంతో పాటు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయక అనేక సమస్యలు ఎదురైనట్లు తెలిపారు.
అంతేకాకుండా కొన్నిచోట్ల తూకంలో మోసాలు చేయడంతో రైతులు నష్టపోవాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి అన్నారు. సకాలంలో గన్ని బ్యాగులు సైతం సక్రమంగా అందజేయలేక ప్రభుత్వం రైతులను అనేక ఇబ్బందులకు గురిచేసిందని ఆరోపించారు. ప్రస్తుతం వరి కోతలు ప్రారంభం అవుతుండడంతో ఇప్పటికైనా ప్రభుత్వం ముందు చూపుతో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని సౌకర్యాలు పకడ్బందీగా ఏర్పాటు చేయాలన్నారు.
ప్రస్తుతం ఎల్ నీ నో ప్రభావంతో వేసిన పంటలు ఎక్కడికక్కడ ఎండిపోవడంతో రైతులు అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఎదురవుతుందని రైతులకు పంట నష్టపరిహారం కింద ప్రభుత్వం ఎకరాకు 30 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నర్సింలు, జెడ్పిటిసి ఆంజనేయులు, బిఆర్ఎస్ మండలాధ్యక్షుడు రామచంద్ర రెడ్డి, మాజీ పిఎసిఎస్ చైర్మన్ దుర్గారెడ్డి ఆయా గ్రామాల సర్పంచులు, ఐకెపి, పిఎసిఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Ka Baap Bhi Jayega: ఖర్గే క్షమాపణ చెప్పాల్సిందే.. దేశవ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం
Invited for Bihu, then attacked | పూజా కార్యక్రమానికి ఆహ్వానించి.. బిహు కళాకారులపై దాడి
Womens Health | వయస్సు మళ్లుతున్న మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తుంటే.. జాగ్రత్త పడాల్సిందే..
Water Tankers | సిద్దిపేట జిల్లాలో ట్యాంకర్లతో పొలం పారిస్తున్న రైతన్న.. వీడియో
Kavita Kumari: కాళ్లకు షూ లేకుండా చీరలో రన్నింగ్ .. ఆ కవిత కల నెరవేరలేదు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

