Sarpanches | విద్యుత్ సిబ్బంది కనీసం ఫోన్లు కూడా ఎత్తడం లేదు.. కరెంట్ కష్టాలపై సర్పంచ్లు
Sarpanches | విద్యుత్ సమస్యలపై సిబ్బందికి ఫోన్ చేసినా స్పందించడం లేదని, కనీసం ఫోన్లు కూడా ఎత్తడం లేదని ఝరాసంగంలోని పలు గ్రామాల సర్పంచ్లు విద్యుత్ ఏఈకి ఫిర్యాదు చేశారు.
Sarpanches | ఝరాసంగం, అక్టోబర్ 15 : కాంగ్రెస్ సర్కార్ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా కరెంట్ కోతలు ఎలా ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఓ వైపు సాగునీరు, కరెంట్ కోతలతో రైతులు సతమవుతుండగా.. మరోవైపు గ్రామాల్లో కూడా కరెంట్, తాగునీటి కష్టాలు తప్పడం లేదు.
గ్రామాల్లో నెలకొన్న విద్యుత్, తాగునీటి సమస్యలపై పలు గ్రామాల సర్పంచ్లు సంబంధిత అధికారులను నిలదీశారు. గురువారం మండల కేంద్రమైన ఝరాసంగంలోని రైతు వేదికలో మండల ప్రత్యేక అధికారి లలిత కుమారి అధ్యక్షతన మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బోరేగావ్ సర్పంచ్ నాగేందర్ పటేల్ మాట్లాడుతూ.. గ్రామాల్లో ఓవర్హెడ్ ట్యాంక్లు ఉన్నప్పటికీ మోటార్లు లేకపోవడంతో అవి అలంకారప్రాయంగా మారాయని సభా దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయమై నెల రోజుల క్రితమే సంబంధిత ఏఈకి విన్నవించినా ఇప్పటివరకు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతరం బర్డీపూర్ సర్పంచ్ రాజు మాట్లాడుతూ.. విద్యుత్ సమస్యలపై సిబ్బందికి ఫోన్ చేసినా స్పందించడం లేదని, కనీసం ఫోన్లు కూడా ఎత్తడం లేదని విద్యుత్ ఏఈకి ఫిర్యాదు చేశారు. చెరువులోని నీటిని సాగు కోసం వదిలితే రానున్న రోజుల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి తలెత్తుతుందని కొల్లూర్ సర్పంచ్ శివరాజ్ ఇరిగేషన్ అధికారుల దృష్టికి తెచ్చారు. ఈ సమావేశంలో ఎంపీడీవో మంజుల, డిప్యూటీ తహశీల్దార్ రాజు, ఆయా శాఖల అధికారులు, పలు గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు.
Read Also :
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
unknown callers | గుర్తు తెలియని కాలర్స్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై కాలర్ పేరు తప్పనిసరి
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maharashtra | రోడ్లపై, బహిరంగ ప్రదేశాలలో టపాసులు కాల్చడంపై మహారాష్ట్రలో నిషేధం.. బాంబే హైకోర్టు ఆదేశం
Sarpanches | విద్యుత్ సిబ్బంది కనీసం ఫోన్లు కూడా ఎత్తడం లేదు.. కరెంట్ కష్టాలపై సర్పంచ్లు
Bathukamma Celebrations | కుభీర్లో ఘనంగా కొనసాగుతున్న బతుకమ్మ సంబరాలు
Bhaskar Rao | సింగరేణి లాభాల తగ్గుదలపై సమగ్ర నివేదిక విడుదల చేయాలి : మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు
పంచాయతీ అధికారి పర్సంటేజీల దందా ?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

