Harish Rao | ఓట్లు ఉన్నాయని ఊర్లలో చీరలు.. కానీ మున్సిపాలిటీల్లో మాత్రం లేవు : ఎమ్మెల్యే హరీశ్ రావు
Harish Rao | రేవంత్ రెడ్డి చీరలు కేవలం డ్వాక్రా మహిళలకు మాత్రమే ఇస్తున్నాడు..కేవలం ఓట్లు ఉన్నాయని ఊర్లలో చీరలు పంచుతున్నారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు. నారాయణఖేడ్ మున్సిపాలిటీలో ఓట్లు లేవని చీరలు పంచడం లేదు.కేసీఆర్ పండుగకు చీరలు ఇస్తే రేవంత్ రెడ్డి ఓట్లకు చీరలు ఇస్తున్నాడు. మహిళలకు ఇచ్చిన చీరలు యూనిఫామ్ చీరల్లాగా ఉన్నాయన్నారు.
Harish Rao | బీఆర్ఎస్ అందరికి భరోసా ఇచ్చిందని.. కాంగ్రెస్ మాత్రం అవినీతికి భరోసా ఇచ్చిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. ఆదివారం నారాయణఖేడ్ నియోజకవర్గంలో పర్యటన సందర్భంగా హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి చీరలు కేవలం డ్వాక్రా మహిళలకు మాత్రమే ఇస్తున్నాడు..కేవలం ఓట్లు ఉన్నాయని ఊర్లలో చీరలు పంచుతున్నారు.నారాయణఖేడ్ మున్సిపాలిటీలో ఓట్లు లేవని చీరలు పంచడం లేదు.కేసీఆర్ పండుగకు చీరలు ఇస్తే రేవంత్ రెడ్డి ఓట్లకు చీరలు ఇస్తున్నాడు. మహిళలకు ఇచ్చిన చీరలు యూనిఫామ్ చీరల్లాగా ఉన్నాయన్నారు.
కేసీఆర్ రంగుల చీరలు ఇచ్చారు. కోటి 30 లక్షల చీరలను ప్రతి బతుకమ్మకు కేసీఆర్ ఇచ్చారు. ఈ ప్రభుత్వం ఇస్తుంది 50 లక్షల చీరలే. మహిళలకు నెలలకు 2500 ఇస్తానని చెప్పావు.. అది ఇస్తే మహిళలకు సారె పెట్టినట్టు. రెండేళ్లకు 60 వేల రూపాయలు ప్రతీ మహిళకు బాకీ పడ్డ రేవంత్ రెడ్డి ముందు అది చెల్లించి సారె పెట్టిన అని చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. నారాయణఖేడ్‌కు బీఆర్ఎస్ హయాంలో రోజూ మంచినీళ్లు వచ్చేది. ఇప్పుడు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. 100 కోట్ల రూపాయలను నారాయణఖేడ్ తండాలకు కేసీఆర్ ప్రభుత్వం విడుదల చేసింది. ఆ డబ్బును రేవంత్ రెడ్డి ఇవ్వడం లేదు.8 చెరువులు సాంక్షన్ చేసి భూమి ఇచ్చామన్నారు.
కాళేశ్వరం నీళ్లను బసవేశ్వర ప్రాజెక్టు ద్వారా నారాయణఖేడ్ నియోజకవర్గానికి ఇవ్వాలని కేసీఆర్ బసవేశ్వర ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశారు. బసవేశ్వర ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తారో రేవంత్ రెడ్డి చెప్పాలి. బసవేశ్వర ప్రాజెక్టు పనులను వెంటనే ప్రారంభించాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టుల కోసం బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది. అవసరమైతే పాదయాత్ర కూడా చేస్తాం. సంగారెడ్డి జిల్లా అభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటున్నారు. ఎందుకు సంగమేశ్వర ప్రాజెక్టు పూర్తి చేయడం లేదో ఉత్తంకుమార్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు.

Read Also :
Shiva 4K | శివ 4K వెర్షన్‌ను థియేటర్లలో మిస్సయ్యారా..? అయితే ఈ అప్డేట్ మీ కోసమే..!
Wheat | గోధుమలు అంటే కేవలం చపాతీలే కాదు.. ఇలా కూడా తీసుకోవచ్చు.. ఎన్నో లాభాలను అందిస్తాయి..!
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

