Collector Pratima Singh | పోలీసు అమరవీరుల త్యాగాలను గుర్తించడం ప్రతి ఒక్కరి బాధ్యత : కలెక్టర్ ప్రతిమా సింగ్
Collector Pratima Singh | నిత్యం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ప్రజల భద్రత కోసం ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న పోలీసుల సేవలు స్ఫూర్తిదాయకమన్నారు. అమరవీరుల త్యాగాలు వృథా కాకుండా, వారి స్ఫూర్తితో మరింత బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Collector Pratima Singh | మెదక్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): శాంతిభద్రతల పరిరక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తూ, విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని, సమాజం ఎల్లప్పుడూ వారికి రుణపడి ఉంటుందని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. బుధవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ ప్రతిమా సింగ్, జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఐపీఎస్‌తో కలిసి పాల్గొన్నారు. ముందుగా పోలీసు అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛాలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించి అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు.
ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ..
ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించి అమరులైన పోలీసులను స్మరించుకోవడం, వారి త్యాగాలను గుర్తించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణతోపాటు జిల్లా అభివృద్ధి కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటున్నారని, అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సేవలందిస్తున్నారని పేర్కొన్నారు.
నిత్యం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ప్రజల భద్రత కోసం ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న పోలీసుల సేవలు స్ఫూర్తిదాయకమన్నారు. అమరవీరుల త్యాగాలు వృథా కాకుండా, వారి స్ఫూర్తితో మరింత బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మెదక్ జిల్లాలో ప్రశాంత వాతావరణం నెలకొన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. మారుతున్న నేర స్వరూపానికి అనుగుణంగా పోలీసులు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ సైబర్ నేరాలను సమర్థవంతంగా ఛేదించి నేరస్థులను పట్టుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, నేరాల నియంత్రణకు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పోలీసు సిబ్బందికి సూచించారు.
ప్రజలకు భరోసా కల్పించడం ప్రతి పోలీసు అధికారి బాధ్యత..
జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఐపీఎస్ మాట్లాడుతూ.. మెదక్ జిల్లాలో ఇప్పటివరకు 14 మంది పోలీసులు సంఘ విద్రోహ శక్తుల చేతుల్లో ప్రాణత్యాగం చేసి అమరులయ్యారని తెలిపారు. వారు ప్రజల రక్షణ, సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం చేసిన త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. అమరవీరుల ప్రాణత్యాగాల ఫలితంగానే ప్రజలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా జీవించగలుగుతున్నారని అన్నారు.
దేశ సమగ్రత, ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు నిరంతరం అంకితభావంతో పనిచేస్తున్నారని తెలిపారు. విధి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ ప్రజలకు భరోసా కల్పించడం ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది బాధ్యత అన్నారు. అమరుల కుటుంబాలు చేసిన త్యాగాలను కూడా సమాజం గుర్తించాలని, వారి కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు.
అనంతరం పోలీసు అమరవీరుల కుటుంబాలకు కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు గిఫ్ట్ ప్యాక్‌లను అందజేసి వారి త్యాగాలను గౌరవించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, సీఐలు, ఎస్హెచ్ఓలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Read Also :
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
ప్రమాదాలు జరిగిన పట్టించుకోరా..? రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలంటూ ధర్నా
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Collector Pratima Singh | పోలీసు అమరవీరుల త్యాగాలను గుర్తించడం ప్రతి ఒక్కరి బాధ్యత : కలెక్టర్ ప్రతిమా సింగ్
France Protests | ఫ్రాన్స్ నిరసనకారుల్లో తీవ్రవాద భావజాల అమెరికన్లు..!
Diaper Rash | డైపర్ వాడుతున్న తల్లిదండ్రులకు అలర్ట్.. చిన్నారుల చర్మాన్ని కాపాడేందుకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Ramayana | ‘రామాయణం’ నుంచి రావణాసురుడిగా యశ్ అదిరిపోయే గ్లింప్స్.. శివ తాండవ సోత్రంతో భీభత్సం
Energy Boosters | రోజంతా నీరసంగా ఉంటున్నారా? శక్తినిచ్చే 7 ముఖ్యమైన పోషకాలు ఇవే!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

