నిజాంపేట్, సెప్టెంబర్ 15: సంగారెడ్డి జిల్లా నిజాంపేట్‌కు చెందిన పుట్టి అఖిల (Putti Akhila) పీజీ ప్రవేశ పరీక్షలో (CPGET) స్టేట్ ర్యాంకుతో సత్తా చాటింది. ఇటీవల నిర్వహించిన ఎమ్మెస్సీ బాటని ప్రవేశ పరీక్షలో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. పుట్టి లక్ష్మి, భూమయ్య దంపతులకు ముగ్గురు కూతుర్లు. వారిలో మొదటి ఇద్దరి వివాహం చేశారు. మూడో సంతానమైన అఖిల సంగారెడ్డి ప్రభుత్వ బాలికల కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. ఎమ్మెస్సీ బాటనిలో ప్రవేశం కోసం సీపీగెట్-2025 రాయగా, ఉస్మానియా యూనివర్సిటీ ఇటీవల వాటి ఫలితాలను విడుదల చేసింది. అందులో అఖిల 84 మార్కులతో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానాన్ని దక్కించుకోనీ ఆణిముత్యముగా నిలిచింది. దీంతో ఆమెను తల్లిదండ్రులతో గ్రామ ప్రజలు అభినందించారు.