న్యాల్కల్, నవంబర్ 15 : న్యాల్కల్ మండలంలోని కల్బేమల్ గ్రామంలో పేకాట స్థావరంపై ఆదివారం రాత్రి హద్నూర్ పోలీసులు మెరుపు దాడులు చేశారు. గ్రామానికి చెందిన సునీల్ అనే వ్యక్త ఇంటిలో లక్ష్మి పూజల పేరిటా పేకాట నిర్వహిస్తున్నారనే నమ్మదగ్గ సమాచారం మేరకు హద్నూర్ ఎస్ఐ వినయ్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు చేశారు.
పేకాట అడుతున్న 29 మంది జూదరులను ఆరెస్టు చేశారు. వారి వద్ద నుంచి పేకాట ముక్కలు, రూ. 22,200, 16 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ వినయ్‌కుమార్ పేర్కొన్నారు.
సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో పేకాటలో పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు.
పేకాట అడడం వల్ల కుటుంబాలు నాశనమవుతాయని, జూదం ఆడినా, ఆడించినా కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ దాడిలో ఏఎస్ఐ ఈశ్వర్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.