రాయపోల్ ఆగస్టు 26 : మండల స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ చాటిన కస్తూర్బా గాంధీ (Kasturba Gandhi) పాఠశాల విద్యార్థులను గజ్వేల్ ఏసీపీ నర్సిం (ACP Narsimlu)లు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థినిలు క్రమశిక్షణ, పట్టుదలతో చదువుకుంటూనే క్రీడల్లో రాణించాలని ఆయన సూచించారు. విద్యార్థి దశలో చదువుతోపాటు క్రీడలు కూడా ఎంతో ముఖ్యమన్నారు.
మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో జరిగిన మండల స్థాయి స్కూల్ గేమ్ ఫెడరేషన్ క్రీడా పోటీల్లో కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థులు ద్వితీయ స్థానం సాధించారు. కబడ్డీ పోటీల్లో మూడు మండలాల జట్లను ఓడించి రెండో స్థానంలో నిలిచినందుకు స్థానిక పోలీస్ స్టేషన్లో ఏసిపి నర్సింలు వాళ్లను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో తొగుట సీఐ షేక్ లతీఫ్. దౌల్తాబాద్ ఎస్సై అరుణ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.