Grama Panchayati labourers | ‘బాలవ్వకు గాయం తగ్గేవరకు జీతం ఇవ్వాలి.. గ్రామపంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా వర్తింపచేయాలి’
నిజాంపేట్ మండలం నాగధర్ గ్రామపంచాయతీ లో పనిచేస్తున్న జిపి కార్మికురాలు బాలవ్వ గ్రామంలో ఉదయం సమయంలో ఊరు క్లీన్ చేస్తుండగా (జాడు కొడుతుండగా) 11 కేవీ వైరు స్తంభం నుండి తెగిపోయి కార్మికురాలి చేతిపై పడడంతో ఆమె గాయాలపాలైంది. దీంతో కుటుంబం ఎలా గడుస్తుందో అంటూ ఇబ్బందులు పడుతున్నారు.
Grama Panchayati labourers | నిజాంపేట్, సెప్టెంబర్ 18 : నిజాంపేట్ మండల పరిధిలోని నాగధర్ గ్రామ పంచాయతీ కార్మికురాలు బాలవ్వ కరెంట్ షాక్ తగలడంతో గాయపడింది. కరెంట్ షాక్‌తో తగిలిన గాయం తగ్గేవరకు బాలవ్వకు జీతం ఇవ్వాలని.. కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని సీఐటీయూ డివిజన్ ఏరియా కార్యదర్శి రమేష్ అన్నారు. గాయాలైన కార్మికురాలికి సీఐటీయూ నాయకులు రమేష్ సతీష్‌లు పరామర్శించి డీఎల్పీవో సీఐటీయూ ఆధ్వర్యంలో వినతి పత్రం అందించడం జరిగింది
ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ.. నిజాంపేట్ మండలం నాగధర్ గ్రామపంచాయతీ లో పనిచేస్తున్న జిపి కార్మికురాలు బాలవ్వ గ్రామంలో ఉదయం సమయంలో ఊరు క్లీన్ చేస్తుండగా (జాడు కొడుతుండగా) 11 కేవీ వైరు స్తంభం నుండి తెగిపోయి కార్మికురాలి చేతిపై పడడంతో ఆమె గాయాలపాలైంది. దీంతో కార్మికురాలికి చెయ్యి లేపడానికి రావడం లేదు. కార్మికురాలికి కుటుంబం, పిల్లలు ఉండడంతో కుటుంబం ఎలా గడుస్తుందో అంటూ ఇబ్బందులు పడుతున్నారు.
కాబట్టి కార్మికురాలు గాయం తగ్గేవరకు గ్రామపంచాయతీ నుండే జీతం ఇవ్వాలని అలాగే మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తీసుకెళ్లి చూపించాలని అన్నారు. ప్రభుత్వం చిన్న జీతం కాబట్టి వారికి గ్రామపంచాయతీ నుండి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని.. జీతంతో సంబంధం లేకుండా ప్రభుత్వం ఈఎస్ఐ సౌకర్యం కల్పించే విధంగా జీవో తీసుకురావాలని అన్నారు.
ప్రమాద బీమా ఈఎస్ఐ సౌకర్యం ఉంటే వారి కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని ఇలాంటి సౌకర్యాలు ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా గ్రామ కార్యదర్శులు సలహాలు, సూచనలు అందివ్వాలని ప్రమాదాలు జరిగిన ఎంపీడీవో, ఎంపీవో అధికారులు కార్మికురాలిని పరామర్శించలేరని.. చనిపోతే కూడా అధికారులు పట్టించుకోరా..? అని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కార్మికులకు న్యాయం చేసే విధంగా ప్రమాద బీమా పథకం అమలు చేసేందుకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు సతీష్, రవికుమార్ ఉన్నారు.
Read Also :
Road accident | అడవి పందులను తప్పించబోయి రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
Anaconda Trailer | 21 ఏండ్ల తర్వాత రాబోతున్న అనకొండ.. ట్రైలర్ చూశారా!
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay | తమిళ సినీ పరిశ్రమకు విజయ్ సర్కార్ గుడ్‌న్యూస్.. రోజుకు ఆరు షోలకు అనుమతి,కాని దానికి మాత్రం నో!
Kiran Abbavaram | బాల్యపు జ్ఞాపకాలను గుర్తుచేసే ‘సమ్మర్ హాలిడేస్’.. కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు
Anirudh-Kavya | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి పిలుపు ప్రత్యేకం.. ఒక్కో ఆహ్వాన పత్రిక ఖర్చు రూ.20 వేల వరకు!
Sreeleela | రజినీకాంత్ ‘ధర్మన్’లో శ్రీలీల.. స్పెషల్ ప్రీ లుక్‌తో హింట్ ఇచ్చిన మేకర్స్!
EAPCET Office | గెస్ట్‌హౌస్‌గా ఎప్‌సెట్ ఆఫీస్.. అడ్మిషన్ల వేళ జేఎన్టీయూ సంచలన నిర్ణయం!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

