Anaconda Movie Trailer| హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ అనకొండ (Anaconda) ఫ్రాంచైజీలో మరో చిత్రం రాబోతుంది. ఇప్పటివరకు ఈ ఫ్రాంచైజీలో నాలుగు సినిమాలు రాగా.. సూపర్ హిట్ అందుకున్నాయి. అయితే దాదాపు 21 ఏండ్ల తర్వాత మళ్లీ ఇదే ఫ్రాంచైజీలో అనకొండ అంటూ మరో చిత్రం రాబోతుంది. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఈ ట్రైలర్ చూస్తుంటే.. డాగ్ (జాక్ బ్లాక్), గ్రిఫ్ (పాల్ రుడ్) చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు. వీరిద్దరూ కలిసి
ఎప్పటికైనా అనకొండ సినిమాను కామెడీ తరహాలో రిమేక్ చేయాలని కలలు కంటుంటారు. అయితే వీరి కలను నిజం చేసుకొవడానికి కొంతమంది బృందంతో కలిసి అమెజాన్ అడవులలోకి వెళతారు. అయితే అమెజాన్ ఫారెస్ట్‌లోకి వెళ్లిన అనంతరం వారికి ఒక భారీ అనకొండ ఎదురవుతుంది. దీంతో వారు అక్కడినుంచి ఎలా తప్పించుకున్నారు అనేది సినిమా స్టోరీ. జాక్ బ్లాక్ (Jack Black), పాల్ రూడ్ (Paul Rudd)తో పాటు ఈ సినిమాలో సెల్టన్ మెల్లో, డానియేలా మెల్చియర్, తండివే న్యూటన్, స్టీవ్ జాన్ కీలక పాత్రల్లో నటించగా టామ్ గోర్మికన్ (Tom Gormican) దర్శకత్వం వహించాడు. సోనీ పిక్చర్స్ నిర్మించి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తోంది.