BRS | బీఆర్ఎస్ హయాంలోనే లింగంపల్లి అభివృద్ధి: మాజీ వైస్ ఎంపీపీ కమ్రోద్దీన్
మునిపల్లి మండల పరిధిలోని లింగంపల్లి గ్రామం బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలోనే అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందని మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు కంరోద్దిన్ (బాబాపటేల్) అన్నారు. మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ (Chanti Kranthi Kiran) ప్రత్యేక చొరవతో గ్రామాన్ని అభివృద్ధిపథంలో నడిచిందని తెలిపారు.
మునిపల్లి, డిసెంబర్ 06: మునిపల్లి మండల పరిధిలోని లింగంపల్లి గ్రామం బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలోనే అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందని మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు కమ్రోద్దీన్ (బాబాపటేల్) అన్నారు. మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ (Chanti Kranthi Kiran) ప్రత్యేక చొరవతో గ్రామాన్ని అభివృద్ధిపథంలో నడిచిందని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గ్రామానికి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ మంజూరు చేసిన ఘనత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌కి దక్కుతుందన్నారు. గత పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి బాటలో నడిచాయన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడుస్తున్నప్పటికీ ఎక్కడా అభివృద్ధి చెందిన దాఖలు లేవని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన దొంగ హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రజలను నమ్మించి మోసం చేయడంలో కాంగ్రెస్ ఎల్లప్పుడూ మొదటి స్థానంలో ఉంటుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను అడ్డం పెట్టుకొని ఇందిరమ్మ చీరల పేరుతో నాసిరకమైన చీరలను పంపిణీ చేసి ప్రజల్లో మరోసారి నమ్మకం పోగొట్టుకున్నారని తెలిపారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటుతో తాగిన బుద్ధి చెప్పడం ఖాయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు అప్సర్, సీనియర్ నాయకులు కురిసిత్, బక్కన్న, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
Chakali llamma | చాకలి ఐలమ్మ విగ్రహ ధ్వంసంపై పద్మా దేవేందర్‌రెడ్డి ఆగ్రహం
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

