Robbery | పుణ్యక్షేత్రానికి వెళ్లిన ఫ్యామిలీ.. రాత్రి కారులో హైదరాబాద్‌కు తిరిగొస్తుంటే..
Robbery | హర్షవర్ధన్ తన కుటుంబ సభ్యులతో కలిసి మహారాష్ట్రలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తుల్జాపూర్ భవాని మాత దర్శనానికి వెళ్లారు. దర్శనం ముగించుకుని ఆదివారం రాత్రి కారులో తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరారు.
Robbery | జహీరాబాద్, అక్టోబర్ 26 : సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలోని ముంబై జాతీయ రహదారిపై దారి దోపిడీ కలకలం రేపింది. భక్తుల కుటుంబాన్ని తుపాకీతో బెదిరించి దుండగులు బంగారం ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌కు చెందిన హర్షవర్ధన్ తన కుటుంబ సభ్యులతో కలిసి మహారాష్ట్రలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తుల్జాపూర్ భవాని మాత దర్శనానికి వెళ్లారు. దర్శనం ముగించుకుని ఆదివారం రాత్రి కారులో తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరారు.
కోహిర్ మండలం చింతల గట్టు గ్రామ శివారులోని జాతీయ రహదారిపై రాత్రి సమయంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు కుటుంబ సభ్యులు కారు దిగారు. అదే అదునుగా చూసి గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు బైక్‌పై అక్కడికి వచ్చారు. ఒక్కసారిగా కారు డ్రైవర్‌పై తుపాకీ గురిపెట్టి చంపుతామని బెదిరించారు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన హర్షవర్ధన్ కుటుంబ సభ్యుల మెడలో ఉన్న సుమారు మూడు తులాల బంగారు ఆభరణాలను లాక్కొని బైక్‌పై పరారయ్యారు.
పోలీసుల దర్యాప్తు :
ఈ ఘటనతో షాక్‌కు గురైన బాధితులు వెంటనే కోహిర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జాతీయ రహదారిపై పెట్రోలింగ్ ముమ్మరం చేసి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం.
Read Also :
Jailer 2 | జైలర్ 2 బాక్సాఫీస్ సునామీ.. 11 రోజుల్లోనే రూ.700 కోట్లకు పైగా వసూళ్లు!
వాల్మీకి మహర్షి జీవితం పట్టుదలకు మారు పేరు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Robbery | పుణ్యక్షేత్రానికి వెళ్లిన ఫ్యామిలీ.. రాత్రి కారులో హైదరాబాద్‌కు తిరిగొస్తుంటే..
Malaria vaccine | మలేరియా టీకా ధరలు తగ్గింపు.. మరో 10 లక్షల మంది పిల్లలకు రక్షణ..!
US Strikes: ట్రంప్ ఆదేశిస్తే.. 96 గంటల్లోనే అటాక్
Cyclone Arnab | అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. పాపికొండలు విహారయాత్రకు బ్రేక్..!
MLA Anirudh Reddy | నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

