
జిన్నారం, ఆగస్టు 24 : సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరం అని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో మండలంలోని ఐదు గ్రామాలకు చెందిన పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. నల్తూరు గ్రామానికి చెందిన కావాలి శ్రీనివాస్, కొడకంచి గ్రామానికి చెందిన అర్జున్, బుచ్చమ్మ, వెంకటయ్య, జిన్నారం గ్రామానికి చెందిన లక్ష్మి, గోపాల్, కిష్టయ్యపల్లి గ్రామానికి చెందిన దానయ్య, రాళ్లకత్వ గ్రామానికి చెందిన గోపికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ ఎంతో ఉపయెగపడుతుందన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజేశ్, కొడకంచి సర్పంచ్ శివరాజ్, నల్తూరు సర్పంచ్ జనార్దన్, వెంకటేశ్, మహేశ్, రామకృష్ణ, మల్లేశ్, భీమ్రావు, సాయిగౌడ్, పద్మారావు తదితరులు పాల్గొన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్స్‌తో సంపూర్ణ ఆరోగ్యం..
పటాన్చెరు, ఆగస్టు 24 : సీఎం రిలీఫ్ ఫండ్స్‌తో పేదలకు సంపూర్ణ అరోగ్యం లభిస్తున్నదని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం పటాన్చెరు పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో బాధితులకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్స్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. నియోజకవర్గ పరిధిలోని 50 మంది బాధితులకు రూ.16.55 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వేలాది మంది పేదల ఆరోగ్యాలు మెరుగయ్యాయన్నారు. కరోనా కారణంగా తీవ్ర ఆర్థికమాంద్యం ఏర్పడినప్పటికీ సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాల అమలులో వెనుకడుగు వేయలేదన్నారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతున్నదన్నారు. అభివృద్ధిలో అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు వెళ్తున్నామన్నారు. అనారోగ్యంతో ఉన్నవారు, శస్త్ర చికిత్సలు అవసరమైనవారు సీఎం రిలీఫ్ ఫండ్స్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నియోజకవర్గంలోని ప్రజల ఆరోగ్యాలకు భరోసా కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, అమీన్‌ఫూర్ జడ్పీటీసీ సుధాకర్‌రెడ్డి, ఆర్సీపురం మాజీ కార్పొరేటర్ అంజయ్యయాదవ్, దశరథరెడ్డి, ఉమేశ్, రాజేశ్, మల్లేశ్, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
ఆలయాల అభివృద్ధికి కృషి
అమీన్పూర్, ఆగస్టు 24 : నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం అమీన్పూర్ మండలం ఐలాపూర్ తండాలో సంత్ సేవాలాల్ మహరాజ్, జగదాంబిక భవానీ దేవాలయాల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేవాలయాల ద్వారా ఆధ్యాత్మిక భావాలు పెంపొందుతాయన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. తన సొంత నిధులతో పురాతన ఆలయాలకు మరమ్మతులు చేస్తూ నూతన ఆలయాలు నిర్మిస్తున్నానని తెలిపారు. సమాజానికి సంత్ సేవాలాల్ మహరాజ్ చేసిన సేవలు వెలకట్టలేనివని, ఆయన బాటలో యువత నడువాలని సూచించారు. ప్రతిఒక్కరూ తమ జీవితంలో ఎదుటివారికి సేవ చేయడంతోపాటు దైవభక్తి పెంపొందించుకోవాలని తెలిపారు. ఐలాపూర్ తండాలో ఆలయాల నిర్మాణం చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. అంతకుముందు ఎమ్మెల్యేకు తండావాసులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో అమీన్పూర్ జడ్పీటీసీ సుధాకర్‌రెడ్డి, సర్పంచ్‌లు కృష్ణ, మల్లేశ్, రవి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈర్ల రాజు, నాయకుడు సత్యనారాయణ, ప్రజాప్రతినిధులు, జంజారా సేవాలాల్ ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.