సంగారెడ్డి కలెక్టరేట్, సెప్టెంబర్ 30: ప్రజావాణి అర్జీలను వేగంగా పరిష్కరించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి అర్జీలను ఆమె స్వీకరించారు.
మొత్తం 60 అర్జీలను కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులపై దృష్టిసారించి పరిష్కరించాలన్నారు. అన్ని గురుకులాలు, ఆదర్శ, కేజీబీవీ పాఠశాలల్లో మెనూ ప్రకారం భోజనం అందించాలని, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీఆర్వో పద్మజారాణి, ఏవో పరమేశ్, అధికారులు పాల్గొన్నారు.