సిద్దిపేట అర్బన్, అక్టోబర్ 16: సిద్దిపేట అర్బన్ మండల పరిధిలోని మందపల్లి గ్రామంలోని డీఎక్స్ఎన్ మ్యానిఫ్యాక్చరింగ్ ఇండియా కంపెనీలో బుధవారం తెలంగాణలోనే అతిపెద్ద ఇండోర్ కుంకుమ పువ్వు సాగుపై ప్రదర్శన నిర్వహించారు. ఈ మేరకు డీఎక్స్ఎన్ కంపెనీ ఆవరణలో పరిశ్రమ ప్రముఖులు, వ్యవసాయ నిపుణుల ఆధ్వర్యంలో కుంకుమ పువ్వు సాగు ప్రదర్శన నిర్వహించారు. కుంకుమ పువ్వు పెంపకం ప్రక్రియ ను, కుంకుమ పువ్వు ధారాల సేకరణలో ఆధునిక పద్ధతులను వివరించారు.
ఇండోర్ వ్యవసాయం, వ్యవసాయంలో మార్పు, వనరుల నిర్వహణ, ఆహార భద్రత సవాళ్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భం గా ఫ్యాక్టరీల ప్రాంతీయ అధిపతి గిరి విజయన్, ప్రాజెక్ట్స్ కోఆర్డినేటర్ పవన్ దేశ్పాండే మాట్లాడుతూ..సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులతో సాంకేతికతను జోడిస్తూ ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. కుంకుమ పువ్వు సాగులో ఇదొక అద్భుతమైన విజయమన్నారు. కాశ్మీర్ నుంచి విత్తనాలు తీసుకువచ్చి కంపెనీలో ఒక కోల్డ్ రూమ్ ఏర్పాటు చేసి పంట సాగు చేశామని, సుమారు 4 నెలల్లోనే పంట చేతికి వచ్చిందన్నారు.
మార్కెట్లో లభించే కుంకుమ పువ్వుతో పోలి స్తే ఇక్కడ పండించిన కుం కుమ పువ్వు ఎక్కువ నాణ్యతతో, సువాసన కలిగి ఉందన్నారు. సిద్దిపేటలో ఏర్పాటు చేసిన డీఎక్స్ఎన్ ఫ్యాక్టరీ 50 ఎకరాల్లో విస్తరించి ఉందని, ఇందులో స్థానిక ప్రజలకు, రైతులకు సహాయపడే అనేక ప్రాజెక్టులు జరుగుతున్నాయన్నారు. ఇదేకాకుం డా ఈ కంపెనీలో నోని, రోసెల్లె సాగు, కిమోమో ఉత్పత్తి మొదలైనవి జరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో ఫ్యాక్టరీ ఇన్ చార్జి చింగ్ ఎంగ్ బువాన్, సెక్షన్ మేనేజర్ సాయికిరణ్, కుం కుమ పువ్వు సాగు నిపుణులు గౌతమ్ రాథోడ్, సుభాష్ తది తరులు పాల్గొన్నారు.