అరకొర బస్సులు.. విద్యార్థుల అవస్థలు
బడి బస్సులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. పలు మార్గాల్లో బస్సు సర్వీస్‌లు లేవు. ఉన్న రూట్లలో సమయానికి రాక ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో విద్యార్థులకు ఇక్కట్లు తప్పడం లేదు. సమయానికి బస్సులు రాకపోవడంతో పాఠశాలలకు వెళ్లలేక పోతున్నామని విద్యార్థులు వాపోతున్నారు.
- బడి బస్సులు లేక అవస్థలు పడుతున్న విద్యార్థులు
- మెదక్ జిల్లాలో 14 బస్సులు నడుపుతున్న ఆర్టీసీ అధికారులు
- మరో 10 బస్సులు నడుపాలని విన్నవించిన విద్యార్థుల తల్లిదండ్రులు
- బస్సులు లేక ప్రైవేట్ వాహనాలు, సైకిళ్లపై వస్తున్న విద్యార్థులు
- జిల్లాలో పలు గ్రామాలకు నడువని పల్లె వెలుగులు
- అరకొర నడిసినా ఫుట్‌బోర్డ్‌పై వేలాడుతూ ఫీట్లు చేయాల్సిందే…
- ఆర్టీసీ సేవలపై ప్రజల ఆగ్రహం
- జిల్లాలోని తండాల పరిస్థితి మరీ అధ్వానం
- బస్సులు రాక బడి మానేస్తున్న విద్యార్థులు
మెదక్, జూలై 2 (నమస్తే తెలంగాణ): బడి బస్సులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. పలు మార్గాల్లో బస్సు సర్వీస్‌లు లేవు. ఉన్న రూట్లలో సమయానికి రాక ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో విద్యార్థులకు ఇక్కట్లు తప్పడం లేదు. సమయానికి బస్సులు రాకపోవడంతో పాఠశాలలకు వెళ్లలేక పోతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. మెదక్ జిల్లాలో జడ్పీ, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో విద్యనభ్యసించడానికి వేలా ది మంది విద్యార్థులు రోజూ పాఠశాలలకు వస్తుంటారు. పరిసర గ్రామాల నుంచి వందలాది మంది విద్యార్థులు నిత్యం వచ్చిపోతుంటారు. వీరి కోసం ఆర్టీసీ డిపో అధికారులు 14 బడి బస్సులను తిప్పుతున్నారు. అవి సరిపోక పోవడంతో జిల్లాలోని ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు మరో 10 బస్సులు తిప్పాలని ఆర్టీసీ అధికారులకు విన్నవించారు. అయితే ఆ బస్సులు రావడానికి మరో నెల రోజుల సమయం పడుతుందని మెదక్ ఆర్టీసీ డీఎం సుధ తెలిపారు. జిల్లాలోని మారుమూల గ్రామాలకు బస్సులు లేక అక్కడి విద్యార్థులు ప్రైవేట్ వాహనాల్లో, సైకిళ్లపై వస్తున్నారు. మెదక్ జిల్లాలోని రామాయంపేట మండలం కాట్రియాల, నిజాంపేట మండలం నస్కల్ గ్రామాలకు బస్సులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు కాట్రియాల పరిసర ప్రాంతాల్లో తండాలు ఉన్నాయి. తండాల్లోని గిరిజన విద్యార్థులు సైకిళ్లపై, నడుచుకుంటూ పాఠశాలలకు వస్తున్నారు. ఈ రూట్లో బస్సులను వేయాలని పలుమార్లు విద్యార్థులు ధర్నాలు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. జిల్లా పరిధిలోని రేగోడ్‌లో జడ్పీ పాఠశాల ఉంది. కొత్వాల్‌పల్లి, చౌదర్పల్లి, తిమ్మాపూర్ తదితర గ్రామాల నుంచి విద్యార్థులు జడ్పీ పాఠశాలకు వెళ్లి చదువుకుంటారు. ఈ రూట్లో బస్సులు లేకపోవడంతో ఆటోల్లో పాఠశాలకు వస్తున్నారు. నర్సాపూర్ మండలంలోని అవంచ, ఎల్లాపూర్ గ్రామాలకు పల్లె వెలుగు బస్సు లు నడకవపోడంతో విద్యార్థులు ఆటోలు, సైకిళ్లపై పాఠశాలలకు వెళ్తూ అవస్థలు పడుతున్నారు.
బస్సు ఎక్కాలంటే కుస్తీ పట్టాల్సిందే..
మెదక్ పట్టణానికి పరిసర గ్రామాల నుంచి పాఠశాలలు, కళాశాలలకు రోజూ రెండువేల మందికి పైగా విద్యార్థులు వస్తుంటారు. వీరిలో విద్యార్థినుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఉదయం పాఠశాల సమయానికి విద్యార్థులతోపాటు సామాన్య ప్రజలు కూడా బస్సు ల్లో ప్రయాణిస్తున్నారు. దీంతో విద్యార్థులు ఫుట్‌బోర్డుపై వేలాడుతూ ప్రయాణిస్తున్నారు. ప్రమాదమని తెలిసినా వీరికి మరో మార్గం లేక ఇలా ప్రయాణిస్తున్నారు. సాయంత్రం పాఠశాల ముగిసిన తర్వాత విద్యార్థులు ఇండ్లకు చేరుకోవాలంటే ఫీట్లు చేయాల్సిందే. బస్సులో సీటు మాట దేవుడెరుగు.. ఫుట్‌బోర్డుపై నిలబడేందుకు సాహసం చేయాల్సి వస్తోంది. వెల్దుర్తి మండలంలోని ఆయా గ్రామాల్లో నుంచి వచ్చే విద్యార్థుల్లో చాలామంది ఫుట్‌బోర్డుపై వేలాడుతూ ప్రమాదం అంచు న రాకపోకలు సాగిస్తున్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

