అక్కన్నపేట, నవంబర్ 22: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని పలు గ్రామాలను శుక్రవారం మానోస్ యూనిదాస్ ప్రతినిధులు సందర్శించారు. లోడి సాంఘిక సేవా సంస్థ మండలంలోని మైసమ్మవాగుతండా, చౌడ్తండా, మబ్బుకుంట, పంచరాయ, డేక్యాతండా, గండిపెల్లి, గొల్లపల్లి గ్రామాల్లో సేంద్రియ విధానంలో చేస్తున్న వ్యవసాయాన్ని బృందం పరిశీలిచింది.
ఈ సందర్భంగా లోడిసాంఘిక సేవాసంస్థ డైరెక్టర్ సింగిరెడ్డి ఇన్నారెడ్డి మాట్లాడుతూ.. సేం ద్రియ వ్యవసాయాన్ని తమ సంస్థ ప్రోత్సహిస్తున్నదని, దీనికోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతులకు కూరగాయల విత్తనాలు, వర్మీ కంపోస్టు పిట్స్, చెరువు, బావిపూడిక పనులు, చెక్డ్యా మ్ నిర్మాణం, కోడిపిల్లల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మానోస్ యూనియన్ ప్రతినిధులు రోశియోబోనెట్కెవరో, ఆల్బర్ట్ మార్టినేజ్, ప్రాజెక్టు కోఆర్డినేటర్ బాలశౌరి, ఫీల్డ్ కోఆర్డినేటర్ సత్యనారాయణ, మాజీసర్పంచ్ చందబోయిన కుమార్, మాజీ ఉపసర్పంచ్ రాములు, లక్ష్మణ్, రవికుమార్, తిరుమల, రమేశ్, కృష్ణ, అజయ్, తిరుపతి ఉన్నారు.