మెదక్ మున్సిపాలిటీ, నవంబర్ 29 : మెదక్ చర్చి బిష ప్ రెవరెండ్ సాలోమన్రాజ్ను సినాడ్ సస్పెండ్ చేసింది. తాత్కాలికంగా ఇన్చార్జి బిషప్ డోర్నకల్ చర్చి బిషప్ రెవరెండ్ పద్మారావుకు బాధ్యతలు అప్పజెప్పింది. ఈ మేరకు మంగళవారం సికింద్రాబాద్‌లోని డయాసిస్ కార్యాలయంలో మెదక్ బిషప్‌గా పద్మారావు బాధ్యతలు స్వీకరించారు. వివరాలలోకి వెళితే మెదక్ డయాసిస్ బిషప్‌గా సా లోమాన్రాజ్ను చెన్నయ్‌లోని తిరువెళ్లలో 2016 అక్టోబర్‌లో 13న జరిగిన ముఖ్య కార్యవర్గ సమావేశంలో సినార్డ్ మాడినేరేటర్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకుని 8వ బిషప్‌గా నియమించారు.
2016 అక్టోబర్ 15న బిషప్ బాధ్యతలు స్వీకరించారు. నేటికి బిషప్‌గా బాధ్యతలు స్వీకరించి 6సంవత్సరాలు గడుస్తున్నది. ముఖ్యంగా సీఎస్ఐ రాజ్యాంగం ప్రకారం.. బిషప్‌గా బాధ్యతలు స్వీకరించడానికి 50సంవత్సరాల వయస్సుపై బడి.. తగిన అర్హతలు గల వారికే బిషప్‌గా అవకాశం కల్పిస్తారు. బిషప్ పదవి చేపడితే 65సంవత్సరాల వయస్సు వచ్చే వరకు కొనసాగుతారు. పదవి చేపట్టే నాటికి సాలోమన్రాజ్ వయస్సు 53సంవత్సరాలు. అంటే 2028 వరకు బిషప్‌గా కొనసాగే అవకాశం ఉంది. కానీ కేవలం 6 సంవత్సరాల వ్యవధిలో బిషప్‌ను తొలిగించడం గమనార్హం. మెదక్ డయాసిస్‌లో ఉమ్మడి జిల్లాలో మెదక్‌తో పాటు నిజామాబా ద్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి.
ఎన్నికల అవకతవకలతోనే..
పాస్టరేట్ కమిటీ ఎన్నికల్లో జరిగిన అవకతవకలతోనే బిషప్‌ను తొ లిగించే దాకా వచ్చిందని సమాచా రం. సీఎస్ఐ కమిటీ ఎన్నికల్లో విజ యం సాధించిన ప్యానల్ వారికే పాస్టరేట్ కమిటీలో పోటీ చేసే అవకాశం ఉన్నా బిషప్ ఓడిపోయిన ప్యానల్‌కు అవకా శం ఇచ్చి సీఐస్ఐ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని గంట సంపత్ ప్యానల్ సభ్యులు ఆరోపిస్తూ పలుమార్లు సినాడ్‌కు ఫిర్యాదు చేశారు.
గత నెల అక్టోబర్ 1న జరిగిన ఆఫీసు బేరర్ ఎన్నికల్లో సీఎస్ఐ నిబంధనల ప్రకా రం.. గంట సంపత్ ప్యానల్ సభ్యులు 11మంది గెలిస్తే వారిని కాకుండా కేవలం ఏడుగురు గెలిచిన రోలండ్పాల్ ప్యానల్ సభ్యులకు పాస్టరేట్ కమిటీ ఎన్నికల్లో అవకాశం కల్పించారు. అంతే కాకుండా తనకు న్న విచక్షణాధికారంతో పలువురు సభ్యుల ను నామినేట్ చేశారు. దీంతో గంట సంప త్ ప్యానల్లో గెలిచిన సభ్యుల కంటే బిషప్ నామినేట్ చేసిన సభ్యులతో కలుపుకుని రోలండ్పాల్ ప్యా నల్ సభ్యులు ఎన్నికల్లో విజయం సాధించారు. బిషప్ సీఎస్ఐ నిబంధలకు వ్యతిరేకంగా ఎక్కువ మందిని నామినేట్ చేసి మా ప్యానల్‌కు పదవులు దక్కకుండా చేశారని సంపత్ ఆరోపించా రు.
రెండు సంవత్సరాలకోసారి జరిగే ఎన్నికల్లో గతంలో సైతం మా ప్యానల్ అత్యధిక సభ్యులు గెలిచిన మాకు అన్యాయం చేశారని, మరిపుడు బిషప్ అన్యాయం చేశారంటూ సినాడ్ దృష్టికి గంట సంపత్ ప్యానల్ తీసుకెళ్లింది. అన్యాయాన్ని నిరసి స్తూ చర్చి ఎదుట బిషప్ దిష్టిబోమ్మను దగ్దం చేశారు. సీఎస్ఐ రాజ్యాంగానికి లోబడి నడుచుకోలేదని సినాడ్ సాలోమన్రాజ్ను సస్పెండ్ చేసి న్యాయం చేసిందని చర్చి కమి టీ సభ్యులు పేర్కొంటున్నారు.