
రామచంద్రాపురం, జనవరి 4 : భారతీనగర్ డివిజన్లోని ఇక్రిశాట్ ఫెన్సింగ్ ఏరియాలో నివాసముంటున్న వారికి ఇండ్ల పట్టాలు ఇప్పిస్తామని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు బల్దియా ఎన్నికల సందర్భంగా మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఫెన్సింగ్ ఏరియా వాసులకు ఇండ్ల పట్టాలు ప్రభుత్వంతో మంజూరు చేయించారు. మంగళవారం ఆర్సీపురం తాసీల్ కార్యాలయం ఆవరణం లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు ప్రొటెం చైర్మన్ భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, కార్పొరేటర్ సింధూఆదర్శ్‌రెడ్డి ఇండ్ల పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రొటెం చైర్మన్, ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇక్రిశాట్ ఫెన్సింగ్ ఏరియాలో నివాసముంటున్న 453 మంది లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు మంజూరైనట్లు చెప్పారు. కొవిడ్ నిబంధనల మేరకు 25 మందికి మాత్రమే ఇండ్ల పట్టాలు ఇచ్చినట్లు తెలిపారు. మంత్రి హరీశ్‌రావు కృషితోనే ఇండ్ల పట్టాలు సాధ్యమయ్యాయన్నారు. ఇండ్ల పట్టాల మంజూరుతో లబ్ధిదారుల కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. అనంతరం కార్పొరేటర్ సింధూఆదర్శ్‌రెడ్డి మాట్లాడుతూ బల్దియా ఎన్నికల్లో ఇచ్చిన మాటను మంత్రి హరీశ్‌రావు, ప్రొటెం చైర్మన్ భూపాల్‌రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి సహకారంతో నిలబెట్టుకోవడం జరిగిందన్నారు. లబ్ధిదారులందరికీ ఇండ్ల పట్టాలు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో సంగారెడ్డి అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీవో నగేశ్, తహసీల్దార్ శివకుమార్, కార్పొరేటర్ పుష్పానగేశ్, మాజీ కార్పొరేటర్ అంజయ్య, మాజీ సర్పంచ్ రాజేశ్వర్‌రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు బూన్, యువజన అధ్యక్షుడు నర్సింహ, కుమార్‌గౌడ్, మోహన్‌రెడ్డి, కుత్బుద్దీన్, నర్సింగ్‌రావు, కృష్ణమూర్తిచారి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.