జహీరాబాద్, జనవరి 28: సేంద్రియంగా పండించిన ఆహార ధాన్యాలు కొనుగోలు చేసేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారు. ప్రతిరోజు వరి అన్నంతో పాటు చిరుధాన్యాలు ఆహారంగా తీసుకునేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. చక్కెర తీసుకోకుండ, బెల్లం తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలు తమ ఆహారంలో సైతం మార్పులు చేసుకుంటున్నారు. ప్రజలు రసాయన ఎరువులతో పండించిన ఆహారం తీసుకొని రోగాలకు గురికావడంతో అధికశాతం వారు చక్కెర తీసుకోవడం తగ్గించారు. చక్కెరను మాని బెల్లం వినియోగం పెంచుతున్నారు. బెల్లంలో అధిక పోషకాలు ఉండటంతో మార్కెట్లో డిమాండ్ పెరిగింది. దీనిలో పోషకాహార విలువలు మెండుగా ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. అందుకే వైద్యులు సైతం బెల్లాన్ని ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. బాలింతలకు బెల్లంతో తయారు చేసిన టీనే తాగించాలని వైద్యులు సూచిస్తున్నారు. మార్కెట్లో లభించే కలర్ బెల్లంలో ఆరోగ్యానికి హాని కలిగించే సల్ఫర్ డయాక్సైడ్ (హైడ్రాష్) ఎక్కువగా ఉంటుంది. వినియోగదారులు మాత్రం ఈ కలర్ బెల్లం కొనుగోలుకే ఇష్టపడుతున్నారు. దీనివల్ల పోషకాహారపు విలువల మాట అటుంచి అరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. దీనికి కారణం కలర్ కోసం రైతులు వినియోగించే హైడ్రాష్ ఆరోగ్యానికి ఎంతో హానికరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మార్కెట్లో కలర్ బెల్లానికి ధర ఎక్కువగా ఉన్నందున రైతులు బెల్లం తయారీలో దీన్ని మోతాదుకి మించి వాడుతున్నారు. దీనిని రూపుమాపేందుకు ప్రజల ఆరోగ్యలను దృష్టిలో పెట్టుకుని ఝరాసంగం మండలంలోని ముచున్నూర్ రైతులు సేంద్రియ ఎరువులతో చెరుకును సాగు చేసి రసాయనాలు వాడకుండా బెల్లన్నీ తయారు చేస్తున్నారు.
మంచి బెల్లం అంటే..!
మంచి బెల్లం లేత బంగారపు రంగు ఉంటుంది. తగినంత రవ్వకట్టు కలిగి గట్టిగా ఉండాలి. పంచదార 80శాతం కంటే ఎక్కువగా ఉండాలి. సల్ఫర్ డయాక్సైడ్ (హైడ్రాష్) క్వింటాలు బెల్లానికి ఏడు గ్రాములు కంటే తక్కువగా ఉండాలి. తేమ శాతం ఆరుకు మించరాదు.
రైతులు చేస్తున్న విధానం..
మార్కెట్లో దొరికే కలర్ బెల్లానికి మంచి ధర పలుకుతుంది. దీంతో సహజంగానే రైతులు కలర్ బెల్లం తయారీకే మక్కువ చూ పుతున్నారు. కలర్ కోసం హైడ్రాష్ 30 గ్రాముల వరకు కలుపుతు న్నారు. ఇది ఏడు గ్రాములకు మించితే ఆరోగ్యానికి ప్రమాదకరం. దీన్ని ఎక్కు వగా కలిపినా బెల్లానికి వచ్చే కలర్ తాత్కాలికమే. వారం రోజులు నిల్వ ఉంటే కలర్ రుచి మారిపోతుంది.
బెల్లంలో పోషకాహారపు విలువలు
బెల్లం పోషక విలువలున్న తీపి పదార్థం. జీర్ణశక్తిని పెంపొంది స్తుంది. సుక్రోజ్ 80శాతం గ్లూకోజు, ప్రక్టోజు 10నుంచి 15శాతం, మాంసకృత్తులు, 0.05 కాల్షియం 0.4శాతం ఉంటాయి. పాస్ఫేట్, ఇనుము, రాగి, భాస్వరం ఎక్కువగా ఉంటాయి.
హైడ్రాష్ వద్దు..
బెల్లం తయారీలో హైడ్రాష్ వాడకం మంచిదికాదు. దీన్ని అధికంగా వినియోగించడం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బ తింటుందని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కీళ్ల నొప్పులు, లివర్ సంబంధిత వ్యాధులు సోకే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి బదులు సున్నపు సుక్రేటు ఉపయోగించాలి. దీని తయారీ కూడా చాలా సులభం. సున్నాన్ని ఐదు రెట్లు నీటిలో కలపాలి. పైకి తేలిన సున్నపు తేటను గుడ్డతో వడ కట్టాలి. వడ బోసిన సున్నపు నీటిని ఐదు రెట్లు చెరకు రసంలో కలిపి కొంత సమయం కదపకుండా ఉంచాలి. పైకి తేలిన ద్రావణాన్నే సున్నపు సుక్రేటు అంటారు. సాధారణంగా ఒక పాకానికి ఉపయో గించే సున్నంతో దీన్ని తయారు చేసుకోవచ్చు. మంచి బెల్లం తయారీకి అనువైన రకాలు ఎంచుకోవాలి. రైతులు సాగు చేసిన తెల్ల చెరుకుతో మంచి బెల్లాన్ని ఉత్పత్తి చేస్తున్నారు.