హైటెక్ తపాలా..
తపాలశాఖ ఉందనే విష యం ఈ కాలంలో చాలా మందికి తెలియనే తెలియదు. కేవ లం ఉత్తరాలు, బట్వాడా లాంటి సేవలకే మరిమితమైతే మనుగడ కష్టమని గ్రహించిన తపాల శాఖ పూర్వకాలం నాటి పద్ధతులకు స్వస్తి పలుకుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటుంది
క్షణాల్లో డిజిటల్ సేవలు
పోస్ట్ ఇన్ఫోయాప్తో మరిన్ని సదుపాయాలు
కొమురవెల్లి, జూన్ 20 : తపాలశాఖ ఉందనే విష యం ఈ కాలంలో చాలా మందికి తెలియనే తెలియదు. కేవ లం ఉత్తరాలు, బట్వాడా లాంటి సేవలకే మరిమితమైతే మనుగడ కష్టమని గ్రహించిన తపాల శాఖ పూర్వకాలం నాటి పద్ధతులకు స్వస్తి పలుకుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త టెక్నాలజీతో వినియోగదారులకు సేవలు అందంచడానికి ప్రయత్నం చేస్తుంది. మార్కెట్లోకి వచ్చిన ప్రతి సేవలను తాము అందిస్తామని సగర్వంగా ప్రచారం చేస్తుంది. ఆధార్ కార్డు నమో దు, సవరణలు, పాస్‌పోర్టు దరఖాస్తు తదితర ఎన్నో సేవలు అందిస్తూ వినియోగదారులకు చేరువ అవుతున్నది. సుకన్య సమృద్ధి యోజన, సేవింగ్స్ డిపాజిట్ల సేకరణలో కూడా వినూత్న పంథా అనుసరిస్తుంది. ఒక్కో మాటలో చెప్పాలంటే అన్నింటా తాను ఉన్నానని చాటి చెబుతుంది.
ఇతర సేవా సంస్థలకు దీటుగా పోస్ట్ ఇన్ఫోమొబైల్ యాప్
త్వరితగతిన సమాచారం కోసం ఇప్పుడు ప్రజలంతా మొబైల్ఫోన్ల మీదనే ఆధారపడుతున్నారు. అన్ని రకాల సేవలు ఫోన్ ద్వారా సులభంగా పొందుతున్నారు. ఈ నేపథ్యంలో తపాలాశాఖ పోస్ట్ ఇన్ఫోమొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో బ్యాంకులు, సేవలందించే ఇతర సంస్థలకు దీటుగా ఈయాప్ చక్కగా ఉపయోగపడుతుంది. అండ్రాయిడ్ మొబైల్లో ప్లేస్టోర్ నుంచి యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
పోస్ట్ ఇన్ఫోమొబైల్ యాప్ ఫీచర్స్
- సుకన్య సమృద్ధి యోజన పథకం : రికవరింగ్ డిపాజిట్ పథకం టైం డిపాజిట్లో ఏడాది నుంచి ఐదేండ్ల వరకు చేసే డిపాజిట్లపై ఆదాయం తెలుసుకోవచ్చు.
- వడ్డీక్యాలిక్యులేటర్ : ఏ డిపాజిట్ పథకంలో ఎంత సొమ్ము కడితే ఎంత మొత్తం తిరిగి పొందవచ్చు. దానికి సంబంధించిన వివిధ పథకాల సమాచారం సులభంగా తెలుసుకోవచ్చు.
- ఆర్టికల్ ట్రాకింగ్ : వినియోగదారులు పంపిన స్పీడ్‌పోస్టు, రిజిస్ట్రర్ పోస్టు, పార్శిల్, ఈఎంవో ఎక్కడ ఉన్నాయో అవతలి వ్యక్తులకు ఎప్పుడు చేరుతాయో తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది.
- కంప్లెంట్స్ ట్రాకింగ్ : వినియోగదారులు ఇచ్చిన ఫిర్యాదులు ఏ దశలో ఉన్నాయి. దానికి సంబంధించిన సమాచారం ఇంకా ఏమైనా కావాలా అనే అంశాలు తెలుస్తాయి.
- ఇన్సూరెన్స్ పోర్టల్ : తపాలాశాఖ ద్వారా అందిస్తున్న వివిధ రకాల బీమా పథకాల గురించి వినియోగదారులు సమగ్రమైన సమచారం ఇన్సూరెన్స్ పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు.
- ఫీడ్‌బ్యాక్ : ఫీడ్ బ్యాక్ పోర్టల్ ద్వారా పోస్టల్ సేవలకు సంబంధించిన సందేహాలు ఏమైనా ఉంటే వివరంగా తెలుసుకోవడమే గాక సలహాలు, సూచనలు ఇవ్వవచ్చు.
- పోస్టేజ్ క్యాలిక్యులేటర్ : వినియోగదారులు పంపించే పార్శిళ్లు, పోస్టల్ కవర్లకు ఎంత బరువుకు ఎంత ధర చెలించాలి. సాధారణ, స్పీడ్ పోస్టులో పంపితే ఎంత ఖర్చు అవుతుందన్న విషయాన్ని చాలా సులభంగా, స్పష్టంగా తెలుసుకోవచ్చు.
- పోస్టల్ ఆఫీస్ సెర్చ్ : దేశంలో ఏపిన్ కోడ్ అయినా తెలుసుకోవచ్చు. ఊరి పేరు నమోదు చేయగానే సంబంధిత పిన్ కోడ్ వస్తుంది. ఫిన్కోడ్ నంబర్ తెలిస్తే డెలివరీ కావాల్సిన పోస్ట్ ఆఫీసు ఎక్కడ ఉన్నది. ఏ తపాలా ప్రధాన కార్యాలయంలో పరిధిలో ఉందో కూడా ఇట్టే తెలుసుకోవచ్చు.
పోస్ట్ ఇన్ఫోయాప్తో ఎన్నో ఉపయోగాలు
తపాలా శాఖ ప్రవేశపెట్టిన పొస్ట్ ఇన్ఫోయాప్తో తొమ్మిది రకాల సేవలు అందుతున్నాయి. వినియోగదారులకు ఈయాప్ ద్వారా మరిన్ని సేవలు అందించే విధంగా తపాలాశాఖ మార్పులు చేస్తుంది. తపాలా వినియోగదారులు ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని 9 రకాల తపాలా సేవలు సులభంగా మీ మొబైల్ ద్వారా పొందవచ్చు. – సబ్బని రఘు సబ్ పోస్ట్‌మాస్టర్, మర్రిముచ్చాల
Read Today's Latest Medak News in Telugu and Telugu News
- Tags
- department
- digital
- postal
- services
RELATED ARTICLES
తాజా వార్తలు
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

