జహీరాబాద్ , మే 06 : పేకాట స్థావరంపై పోలీసులు రైడ్ చేసి పేకాట ఆడుతున్న ఏడుగురిని అరెస్టు చేశారు. జహీరాబాద్ రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జహీరాబాద్ డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, జహీరాబాద్ పట్టణ సీఐ శివలింగం సూచన మేరకు జహీరాబాద్ మండలంలోని హోతి-కే గ్రామ శివారులోని ఇటుకల బట్టి ప్రక్కన గల ఖాళీ స్థలంలోని వేపచెట్టు కింద కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందింది. దీంతో డి.సుజిత్ ప్రొబేషనరీ ఎస్ఐ ఆధ్వర్యంలో రైడ్ చేసి పేకాట ఆడుతున్న ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
నిందితులను కిష్టాపురం అశోక్ (బాగారెడ్డిపల్లి), ఉప్పరి రాములు (కాంతారెడ్డి కాలనీ, జహీరాబాద్), మహ్మద్ గౌస్ (ఖాన్మెల, జహీరాబాద్), గడ్డమీది మోహన్ (దిడ్గి, జహీరాబాద్), పాషామియా, (కాంతారెడ్డి కాలనీ, జహీరాబాద్), గణపురం నర్సిములు (గోపన్పల్లి, మొగుడంపల్లి), మహమ్మద్ ఖాసిం (రాంనగర్, జహీరాబాద్) గా గుర్తించారు. వారి వద్ద నుండి రూ.7,140 నగదు, 6 మోటార్ సైకిళ్లు, 7 మొబైలు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.