సిద్దిపేట కమాన్, అక్టోబర్ 18: పోలీసుస్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి సాధ్యమైనంత త్వరగా వారి సమస్యలు పరిషరించాలని, మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపాలని సిద్దిపేట పోలీసు కమిషనర్ డాక్టర్ అనురాధ సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం సిద్దిపేట రూరల్ పోలీసు స్టేషన్‌ను, సిద్దిపేట రూరల్ సరిల్ కార్యాలయాన్ని ఆమె సందర్శించారు. డయల్ 100 కాల్‌కు పోలీస్ సిబ్బంది వెంటనే స్పందించాలని, ప్రతిరోజు ఉదయం, సాయంత్రం విజబుల్ పోలీసింగ్ విధులు నిర్వహించాలన్నారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
ఇసుక, జూదం, పీడీఎస్ రైస్ అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పా టు చేయాలని సూచించారు. ప్రతి కేసులో పారదర్శకంగా ఇన్వెస్టిగేషన్ చేయాలని సూ చించారు. బెల్టు షాప్‌లపై చర్యలు తీసుకోవాలన్నారు. సీపీ వెంట సిద్దిపేట ఏసీపీ మధు, సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను, ఎస్బీఐ ఇన్స్పెక్టర్ శ్రీధర్‌గౌడ్, సిద్దిపేట రూరల్ ఎస్ఐ అపూర్వరెడ్డి, రాజగోపాలపేట ఎస్ఐ ఆసిఫ్, చిన్నకోడూరు ఎస్ఐ బాలకృష్ణ, బెజ్జంకి ఎస్ఐ కృష్ణారెడ్డి, రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, సిద్దిపేట రూరల్ సరిల్ కార్యాలయ సిబ్బంది ఉన్నారు.