దుబ్బాక,జూన్ 8: ప్రభుత్వం పేదలకు అందించే (పీడీఎఫ్) రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వివరాలను శనివారం దుబ్బాక ఎస్సై గంగరాజు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని జిల్లెల్లకు చెందిన పర్వతం నరేశ్ కంటైనర్‌లో 136 క్వింటాళ్ల రేషన్ బియ్యా న్ని అక్రమంగా సిద్దిపేట-రామాయంపేట రోడ్డులో మెదక్‌కు తరలిస్తున్నాడు. ఈ క్ర మంలో శుక్రవారం అర్ధరాత్రి దుబ్బాక మండలం మర్రికుంట సమీపంలో కంటైనర్ డివైడర్‌ను ఢీకొట్టి రోడ్డు పక్కకు ఒరిగిపోయింది.
ఈ విషయాన్ని కంటైనర్ డ్రైవర్ నరేశ్ తన యజమాని జిల్లెల్లకు చెంది న రాజుకు ఫోన్లో సమాచారమివ్వగా, మరో కంటైనర్‌ను ఘటన స్థలానికి పంపించాడు. రోడ్డు పక్కన ఒరిగిన కంటైనర్ నుంచి రేషన్ బియ్యం బస్తాలను మరో కంటైనర్‌లోకి లోడ్ చేస్తుండగా సమాచారం అందుకున్న దుబ్బాక పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రెండు కంటైనర్లలో రేషన్ బియ్యం బస్తాలను దుబ్బాక పీఎస్‌కు తరలించారు. కంటైనర్ యజమాని రాజుపై కేసు నమోదు చేసి, సివిల్ సప్లయ్ అధికారి రాజిరెడ్డికి రేషన్ బియ్యం అప్పగించినట్లు ఎస్సై తెలిపారు.