నాటారు.. సంరక్షణ మరిచారు
సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని పెద్ద చెరువు కట్టపై వన మహోత్సవంలో నాటిన మొక్కలు అప్పుడే ఎండిపోతున్నాయి. మొక్కలు నాటి, ఆ తర్వాత వాటి సంరక్షణపై శ్రద్ధ చూపక పోవడంతో మొక్కలు ఎండిపోతున్నాయి. ఏటా వానకాలంలో మొక్కలు నాటడం, ఆ తర్వాత నిర్వహణ మరువడంతో పెద్ద చెరువు కట్టపై మొక్కలు దక్కడం లేదు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఇటీవల వన మహోత్సవ కార్యక్రమాన్ని చేర్యాల పెద్ద చెరువు కట్టపై నిర్వహించారు.
- నీరుగారుతున్న వన మహోత్సవం
- చేర్యాలలో ఎండిపోతున్న మొక్కలు
చేర్యాల, జూన్ 28: సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని పెద్ద చెరువు కట్టపై వన మహోత్సవంలో నాటిన మొక్కలు అప్పుడే ఎండిపోతున్నాయి. మొక్కలు నాటి, ఆ తర్వాత వాటి సంరక్షణపై శ్రద్ధ చూపక పోవడంతో మొక్కలు ఎండిపోతున్నాయి. ఏటా వానకాలంలో మొక్కలు నాటడం, ఆ తర్వాత నిర్వహణ మరువడంతో పెద్ద చెరువు కట్టపై మొక్కలు దక్కడం లేదు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఇటీవల వన మహోత్సవ కార్యక్రమాన్ని చేర్యాల పెద్ద చెరువు కట్టపై నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులు, మున్సిపల్ పాలకవర్గం, సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. కానీ, నాటిన మొక్కల్లో కొన్ని అప్పుడే ఎండిపోతున్నాయి. పెద్ద చెరువు కట్ట సుందరీకరణలో భాగంగా చెరువు కట్టకు ఇరువైపులా నాటిన మొక్కలతో పాటు సహజంగా పెరిగిన చెట్లను కాంట్రాక్టర్ తొలిగించారు. అభివృద్ధి కార్యక్రమం చేపడుతుండడంతో తిరిగి మొక్కలు నాటుతారని భావించిన పట్టణ ప్రజలకు నిరాశే ఎదురైంది. ఉన్న చెట్లను తొలిగించగా, కొత్తగా నాటిన మొక్కలు సైతం ఎండిపోతుండడంతో అధికారుల నిర్లక్ష్యంపై పట్టణ ప్రజలు, ప్రకృతి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొక్కల సంరక్షణలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని పెద్ద చెరువు కట్ట వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఆరోపిస్తున్నారు. మొక్కలను సంరక్షించి, చెరువు పరిసరాలు ఆహ్లాదకరంగా మార్చాలని వాకర్స్ అసోసియేషన్ సభ్యులు కోరారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Niranjan Reddy | కొడంగల్ నిర్వాసితులకు ఒక న్యాయం.. వనపర్తి నిర్వాసితులకు మరో న్యాయమా? : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
SA vs AUS | రెన్షా సూపర్ సెంచరీ.. గొప్పగా పుంజుకున్న ఆస్ట్రేలియా..!
Netflix | నెట్‌ఫ్లిక్స్‌లో భారీ ఉద్యోగాల కోత.. 5 శాతం సిబ్బందిని తొలగించేందుకు సన్నాహాలు!
Tragedy | పాకాల బీచ్‌లో విషాదం.. ఇద్దరు మృతి, మరో ఇద్దరు గల్లంతు
ఎంవి పాలెం సమీపంలో పెద్దపులి సంచారం కలకలం?
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

