నమస్తే తెలంగాణ న్యూస్ నెట్వర్క్, ఏప్రిల్ 27 : మెతుకుసీమ ఆదివారం గులాబీమయంగా మారింది. ఊరూవాడ గులాబీజెండాలు రెపరెపలాడాయి. బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకొని నాయకులు ఉదయయే పార్టీ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం దండులా ఎల్కతుర్తి సభకు తరలివెళ్లారు.
ఈ సందర్భంగా దారులన్నీ గులాబీ శ్రేణుల వాహనాలతో నిండిపోయాయి. జై తెలంగాణ.. జై కేసీఆర్ నినాదాలతో మిన్నంటాయి. సిద్దిపేట-ఎల్కతుర్తి రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిండిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో రైతులు, యువత, మహిళలు, నిరుద్యోగులు తదితర వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి.