టేక్మాల్: జాతీయ యువజన వారోత్సవాలు, సంక్రాంతి పండుగ సందర్భంగా టేక్మాల్‌లో మండల స్థాయి పతంగుల పోటీలను ఘనంగా నిర్వహించారు. ‘ఫోటోఫన్’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలకు పెద్ద సంఖ్యలో యువకులు, చిన్నారులు హాజరయ్యారు. భారగా తరలివచ్చి.. ఉత్సాహాంగా పతంగులను ఎగుర వేశారు. పోటీలో ప్రథమ బహుమతి గెలుపొందిన వారికి రూ.5వేలు, రెండో బహుమతి విజేతకు రూ.3వేలు, మూడో బహుమతి విన్నర్‌కు రూ.2వేలు అందజేశారు.
ఈ సందర్భంగా ఫోటో ఫన్ అధినేత మజార్ మాట్లాడుతూ స్వామి వివేకానందుని ఆశయాలకు అనుగుణంగా యువత వ్యక్తిత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. పతంగుల పోటీలతో యువకులు, చిన్నారుల్లో ఉత్సాహాం నెలకొందని ఆయన అన్నారు. యువతను ప్రోత్సహించడానికి ఈ పోటీలను నిర్వహించచామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మక్సుద్, ఆసీఫ్, నాయకులు, పెద్ద సంఖ్యలో యువకులు పాల్గొన్నారు.