వర్గల్, అక్టోబర్16: తాగిన మైకంలో ఓ వ్యక్తి గుడి ఆవరణలో విగ్రహాల ధ్వంసానికి పాల్పడిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. గౌరారం ఎస్సై కరుణాకర్‌రెడ్డి కథనం ప్రకారం..సింగాయిపల్లి గ్రామానికి చెందిన కొప్పోజి వెంకటస్వామి (30)మంగళవారం రాత్రి మద్యం తాగి గ్రామంలోని పెద్దమ్మగుడి ఆవరణలో పోతరాజు, ఇతర విగ్రహాలను ధ్వంసం చేశాడు.
సీసీ పుటేజీల ఆధారంగా గ్రామానికి చెందిన వెంకటస్వామి ధ్వంసానికి పాల్పడ్డాడని నిర్ధారణ కావడంతో బుధవా రం గజ్వేల్ ఏసీపీ పురుషోత్తంరెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై కరుణాకర్‌రెడ్డి, పోలీస్ బృందం ఘటనాస్థలానికి చేరుకొని వెంకటస్వామి ని అదుపులోకి తీసుకొ ని విచారించగా, నేరం ఒప్పుకున్నాడు. కేసు నమోదు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించామని పోలీసులు తెలిపా రు. అనంతరం ఏసీపీ మాట్లాడుతూ గ్రామా ల్లో ఎవరైనా మత విద్వేషాలు రెచ్చగొడుతూ, కులమతాల మధ్య చిచ్చుపెడితే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు.