మెదక్ మున్సిపాలిటీ, ఫిబ్రవరి 21 : ఎస్టీయూ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థులు రఘోత్తంరెడ్డి, నరేందర్‌రెడ్డిలను గెలిపించాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పర్వతరెడ్డి కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం మెదక్‌లోని ఎస్టీయూ భవన్లో ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు రాజగోపాల్‌గౌడ్ అధ్యతన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా పర్వత రెడ్డి మాట్లాడుతూ.. రఘోత్తం రెడ్డి 30 సంవత్సరాల పాటు ఉపాధ్యాయుడిగా, ప్రధానోపాధ్యాయుడిగా, మండల విద్యాధికారిగా విధులు నిర్వహించడంతో పాటు ఎమెల్సీగా 6 సంవత్సరాల పాటు పనిచేసి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారని తెలిపారు. రఘోత్తంరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్‌రెడ్డికి సైతం మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలన్నారు. ఈ సమావేశంలో ఎస్టీయూ నాయకులు పోచయ్య, భూపతిగౌడ్, అశోక్, శ్రీనివాస్, అరుణ్, దిలీప్, రత్నాకర్, రతన్, నరేశ్, జబ్బార్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.