
నర్సాపూర్: పంటల్లో సమగ్ర సస్యరక్షణ చేపట్టాలని కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రం డిఫ్యూటీ డైరెక్టర్ డా.సిద్దీఖీ పేర్కొన్నారు. మంగళవారం మండల పరిధిలోని తిర్మలాపూర్ గ్రామంలో 75వ స్వాతంత్య్ర మహోత్సవం సందర్భంగా తిర్మలాపూర్ గ్రామంలో కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రం హైదరాబాద్ ఆధ్వర్యంలో రైతు సమావేశాన్ని, రైతు ప్రదర్శ నను నిర్వహించారు.
ఈ సందర్బంగా కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రం డిఫ్యూటీ డైరెక్టర్ డా.సిద్దీఖీ మాట్లాడుతూ మిత్రపురుగులు, లింగా కర్షక బుట్టల వినియోగం, సురక్షితమైన పురుగు మందుల వినియోగం, జీవ శిలీంధ్రాల ఉపయోగం తదితర వాటిపై రైతులకు అవగాహన కల్పించామన్నారు. అనంతరం విత్తనశుద్ది చేపట్టారు. కార్యక్రమంలో కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రం సహాయక సస్యరక్షణ అధికారులు నీలరాణి, రవిశంఖర్, విద్యాశ్రీ, ఏవో వెంకటేశ్వర్లు, ఎఈవో ప్రసాద్ పాల్గొన్నారు.