చేర్యాల, మార్చి 1: చేర్యాల ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాలకు ఈజీఎస్ ద్వారా రూ. 2.50కోట్ల నిధులను ఆయన మంజూరు చేయించినట్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి చేర్యాల మండలానికి రూ.80లక్షలు మంజూ రు చేయించానని, ఇందులో చేర్యాల మండలంలోని వీరన్నపేట, దొమ్మాట, చిట్యాల, గుర్జకుంట, దానంపల్లి, ముస్త్యాల, వేచరేణి, నాగపురి గ్రామాలకు రూ.5లక్షల చొప్పున కేటాయించినట్లు తెలిపారు.
కాశేగుడిసెలు, కొత్తదొమ్మాట, ఆకునూరు, చుంచనకోట, కడవేర్గు, తాడూరు, పోతిరెడ్డిపల్లి, పెద్దరాజుపేట, రాంపూర్ గ్రామాలకు రూ.4లక్షల చొప్పున నిధులు మంజూరు చేయించినట్లు పేర్కొన్నారు. కొమురవెల్లి మండలానికి రూ.70లక్షలు మంజూరు చేయించానని, ఇందులో కొమురవెల్లి, రాంసాగర్, మర్రిముస్త్యాల, గౌరాయపల్లి గ్రామాలకు రూ.7 లక్షల చొప్పున మంజూరు చేయించినట్లు తెలిపారు. ఐనాపూర్, గురువన్నపేట, పోసాన్పల్లి, తపాస్పల్లి, రసూలాబాద్, లెనిననగర్, కిష్టంపేట గ్రామాలకు రూ. 6లక్షల చొప్పున మం జూరు అయ్యాయి.
మద్దూరు మండలానికి రూ.50లక్షలు మంజూరు కాగా, అందులో నర్సాయపల్లి, రేబర్తికి రూ.5లక్షల చొప్పున, సలాక్పూర్, మర్మాముల, కమలాయపల్లి, అర్జునపట్ల, ధర్మారం, గాగిళ్లాపూర్, లద్నూర్, మద్దూరు, వంగపల్లి, వల్లంపట్ల గ్రామాలకు రూ.4లక్షల చొప్పున మంజూరు చేయించానని, ధూళిమిట్ట మండలానికి రూ. 50లక్షలు మంజూరు కాగా, అందులో బైరాన్పల్లి, ధూళిమిట్ట, లింగాపూర్, కొండాపూర్, దుబ్బతండా, హనుమ తండాలకు రూ.5లక్షల చొప్పున మంజూరు చేయించినట్లు తెలిపారు. కూటిగల్, రెడ్యానాయక్ తండా, జాలపల్లి, బెక్కల్, తోర్నాలకు రూ.4లక్షల చొప్పున మంజూరు చేయించానని, ఆయా గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నాణ్యతతో గడువులోగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆదేశించారు.