జగదేవ్‌పూర్, డిసెంబర్ 22 : మండలంలోని తీగుల్‌నర్సాపూర్ ప్రసిద్ధ కొండపోచమ్మ దేవాలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. గురువారం ఆలయం వద్ద వేలం పాటు నిర్వహించగా, రూ.54.55లక్షల ఆదాయం సమకూరింది. సర్పంచ్ రజిరమేశ్, కొండపోచమ్మ దేవాలయ కమిటీ చైర్మన్ జంబుల శ్రీనివాస్‌రెడ్డి, ఆలయ కా ర్యనిర్వహణ అధికారి మోహన్‌రెడ్డి, అధికారులు శ్రీనివాస్, మల్లికార్జున్‌రెడ్డి, శ్యాం ఆధ్వర్యంలో జా తరలో కొబ్బరికాయల విక్రయం, లడ్డూ, పులిహోర ప్రసాద తయారీ విక్రయం, అమ్మవారికి భక్తులు పోసే ఒడిబియ్యం సేకరణ, కొబ్బరి చి ప్పల సేకరణ, అమ్మవారి దుకాణ సముదాయాల వేలం పాట నిర్వహించారు. ఈ వేలం పాటలో పలు గ్రా మాల ప్రజలు పాల్గొన్నారు. లడ్డే, పులిహోర ప్రసాదం తయారు చేసి విక్రయించే హక్కు ను తీగుల్‌నర్సాపూర్ గ్రామానికి చెందిన చెక్కల నరేశ్ అ త్యధికంగా రూ.25.20లక్షలకు, కొబ్బరి కాయలు విక్రయించే హక్కును తీగుల్‌నర్సాపూర్ గ్రామానికి చెందిన చెట్టిపల్లి భాగ్యమ్మ అత్యధికంగా రూ.11.20 లక్షలకు పాడి దక్కించుకున్నారు.
కొబ్బరిముక్కల సేకరణను గ్రామానికి చెందిన బోయిని ప్రశాంత్ రూ.6.10 లక్షలకు, ఒడిబియ్యం సేకరణ, అమ్మవారికి భక్తులు సమర్పించే చీరల విక్రయం హక్కును గ్రామానికే చెందిన మేధిని అనిత రూ.8.65 లక్షలకు పాడారు. ఆలయానికి చెందిన ఆరు దుకాణా సమూదాయాలను ఏడాది పాటు కిరాయికి రూ.3.4లక్షలు ఆదాయం సమకూరింది. మొత్తం అమ్మవారి వివిధ వేలం పాటల ద్వారా రూ.54.55 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈవో తెలిపారు. కాగా, గతంలో పోలిస్తే రూ.9.57 లక్షల ఆదాయం అధికంగా వచ్చినట్లు తెలిపారు. అమ్మవారికి వేలం పాట ద్వారా వచ్చిన డబ్బులను అమ్మవారి ఖాతాలో జమ చేసి, ఆలయ అభివృద్ధికి జాతర ఉత్సవాల్లో భక్తుల సౌకర్యార్థం ఉపయోగించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు వెంకట్‌రెడ్డి, రైతుబంధు సమితి గ్రామాధ్యక్షుడు లక్ష్మీనర్సింహరెడ్డి, నాయకులు కనకారెడ్డి కనకయ్య, అర్చకులు కొండయ్య, యాదగిరి, లక్ష్మణ్, రమేశ్, నాయకులు, గ్రామస్తులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.